AV Subba Reddy Attacking Case: కర్నూలు జైలుకు భూమా అఖిల ప్రియ, 14 రోజుల రిమాండ్ విధించిన నంద్యాల కోర్టు, ఆమెతో పాటు మరో ముగ్గురికి రిమాండ్

టిడిపి నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ రిమాండ్ కు ఆదేశించింది నంద్యాల కోర్టు. అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్రామ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరికి కూడా 14 రోజుల రిమాండ్ విధించారు.

AV Subba Reddy Attacking Case: కర్నూలు జైలుకు భూమా అఖిల ప్రియ, 14 రోజుల రిమాండ్ విధించిన నంద్యాల కోర్టు, ఆమెతో పాటు మరో ముగ్గురికి రిమాండ్
Bhuma Akhila Priya (Photo-Instagram)

Kurnool, May 17: టిడిపి నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ రిమాండ్ కు ఆదేశించింది నంద్యాల కోర్టు. అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్రామ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరికి కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. నంద్యాల నుంచి అఖిలప్రియ దంపతులను కర్నూలు జైలుకు తరలించారు.

నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో భూమా అఖిల ప్రియను ఆమె భర్త భార్గవ్ రామ్ ను మరో ఇద్దరిని హాజరు పరిచారు పోలీసులు. ఈ సందర్భంగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ అఖిలప్రియ, ఆమె భర్త JFCM ఇంచార్జ్ జడ్జి ఆదినారాయణకు విన్నవించుకున్నారు. అయితే అఖిలప్రియ బెయిల్ ను తిరస్కరించిన కోర్టు.. ఆమెకు, ఆమె భర్త భార్గవ్ రామ్ కు మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 30 వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో మాజి మంత్రి అఖిలప్రియను కర్నూలు జైలుకు తరలించారు పోలీసులు.

భూమా కుటుంబం-ఏవీ కుటుంబాల మధ్య గొడవేంటి, నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌, అఖిలతో పాటు 11 మందిపై పోలీసులు కేసు నమోదు

టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, ఘటనపై కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌, ఆమె అనుచరులను అరెస్ట్‌ చేశారు.

నలుగురిలో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌ రామ్‌, అఖిలప్రియ పీఏ మోహన్‌, ఆమె అనుచరుడు సాయి ఉన్నారు. ఇక, పరారీలో ఉన్న మరో ఏడుగురి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో పోలీసులు ఐపీసీ 307, 120B, 324, రెడ్ విత్ 34సెక్షన్ కింద భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ సహా నిందితులపై కేసులు నమోదు చేశారు.

(The above story first appeared on LatestLY on May 17, 2023 08:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).