AP Shocker: నాలుగేళ్ల పాపని వదలని 14 ఏళ్ల కామాంధుడు, దారుణంగా అత్యాచారం, చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో విషాద ఘటన, రాత్రికి రాత్రే నిందితుని కుటంబం పరార్, దిశ, పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు

చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలంలో ఈ కిరాతకం చోటు చేసుకుంది.

AP Shocker: నాలుగేళ్ల పాపని వదలని 14 ఏళ్ల కామాంధుడు, దారుణంగా అత్యాచారం, చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో విషాద ఘటన, రాత్రికి రాత్రే నిందితుని కుటంబం పరార్, దిశ, పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు
Image used for representational purpose | (Photo Credits: File Image)

Amaravati, April 4: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలంలో ఈ కిరాతకం చోటు చేసుకుంది. చిన్నారి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. పెనుమూరు మండలం దాసరాపల్లెకు చెందిన నాలుగేళ్ల చిన్నారి శుక్రవారం సాయంత్రం పక్కనే ఉన్న మరో చిన్నారితో ఆడుకునేందుకు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మూత్ర విసర్జన ఇబ్బందిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది.

వాళ్లు పరిశీలించి విచారించగా ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న 14 ఏళ్ల బాలుడు చేసిన అఘాయిత్యం వెలుగుజూసింది. చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని నిర్ధారించుకుని, అతని ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. పెద్ద మనుషులు జోక్యం చేసుకుని శనివారం మాట్లాడుకుందామని సర్దిచెప్పారు. శనివారం ఉదయం 8 గంటలకంతా ఆ ఇంట్లో వారంతా ఇంటికి తాళాలు వేసి పరారయ్యారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిపై దిశ, పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు.

(The above story first appeared on LatestLY on Apr 04, 2021 12:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).