Amaravati Land Scam: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట, సిట్‌పై హైకోర్టు స్టేని కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం, మెరిట్ ప్రాతిపదికన విచారించాలని కీలక తీర్పు

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన ‘సిట్‌’పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సిట్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Amaravati Land Scam: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట, సిట్‌పై హైకోర్టు స్టేని కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం, మెరిట్ ప్రాతిపదికన విచారించాలని కీలక తీర్పు
Supreme Court. (Photo Credits: PTI)

New Delhi, May 3: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన ‘సిట్‌’పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సిట్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది.

చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే.. ఆ సిట్‌ నియామకంపై టీడీపీ నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.సిట్ ఏర్పాటును ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు సవాల్ చేశారు.

ఉత్తరాంధ్రకు కిరీటంగా భోగాపురం ఎయిర్‌పోర్టు, రాబోయే రోజుల్లో జాబ్‌ హబ్‌గా శ్రీకాకుళం, Bhogapuram Airportకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదన్న సుప్రీం కోర్టు.. సీబీఐ , ఈడీ దర్యాప్తునకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదని పేర్కొంది. సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదని, జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదని సుప్రీం బెంచ్‌ ప్రస్తావించింది. ఈ తరుణంలో.. హైకోర్టును తీర్పును పక్కనపెడుతున్నట్లు జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

బుజ్జగింపులు షురూ, సీఎం జగన్‌తో భేటీ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి, గత కొంత కాలంగా అసంతృప్తితో ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే

కేసు విచారణ సమయంలో.. సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృధా , దురుద్దేశం.. తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి?. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని వ్యాఖ్యానించింది బెంచ్‌.

(The above story first appeared on LatestLY on May 03, 2023 02:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).