Amaravati Scam: అమరావతి స్కాం, ఆస్తుల ఎటాచ్‌మెంట్‌పై తదుపరి చర్యల కోసం కోర్టును ఆశ్రయించనున్న ఏపీ సీఐడీ

అమరావతి స్కాంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ (క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌) ఆస్తుల ఎటాచ్‌మెంట్‌పై తదుపరి చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఈ మేరకు ఇవాళ(సోమవారం) విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ వేయనుంది.

Amaravati Scam: అమరావతి స్కాం, ఆస్తుల ఎటాచ్‌మెంట్‌పై తదుపరి చర్యల కోసం కోర్టును ఆశ్రయించనున్న ఏపీ సీఐడీ
AP CID

VJY, May 15: అమరావతి స్కాంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ (క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌) ఆస్తుల ఎటాచ్‌మెంట్‌పై తదుపరి చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఈ మేరకు ఇవాళ(సోమవారం) విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ వేయనుంది.

అమరావతి ఆర్‌-5 జోన్ కేసులో కీలక మలుపు, హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, కేసును రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్‌కు బదిలీ చేయాలని తీర్పు

కోర్టు నుంచి అనుమతులు రాగానే.. సీఐడీ తదుపరి ప్రక్రియ చేపట్టనుంది. ఎటాచ్‌ చేసిన ఆస్తుల విలువను అంచనా వేసేందుకు సిద్ధమైంది సీఐడీ. తద్వారా ఎటాచ్‌ చేసిన ఆస్తుల విలువను ప్రత్యక్షంగా లెక్కించనుంది. ఇప్పటికే చంద్రబాబు కరకట్ట నివాసంతో పాటు మాజీ మంత్రి నారాయణ ఆస్తులను ఎటాచ్‌ చేసింది ప్రభుత్వం. రెంటల్‌ అగ్రిమెంట్‌ లేకుండా కరకట్ట నివాసంలో ఉంటున్న చంద్రబాబు.. లింగమనేనికి లబ్ధి చేకూర్చేలా కరకట్ట నివాసం తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి.

(The above story first appeared on LatestLY on May 15, 2023 03:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).