Supreme Court. (Photo Credits: PTI)

VJY, May 15: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల కేసుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ ముగిసింది. ఆర్‌-5 జోన్ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసును రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్‌కు బదిలీ చేయాలని పేర్కొంది. ఆర్‌-5 జోన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

అమ‌రావ‌తి కేసుతో పాటు ఆర్ 5 జోన్ కేసును క‌లిపి వినాల‌ని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. సోమవారం ఉదయం ఆర్‌ - 5 జోన్‌పై సుప్రీంలో విచారణకు రాగా రైతుల తరపున వాద‌న‌ సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రొతగి, శ్యాందివాన్, దేవ్ దత్ కామత్ వాదనలు వినిపించారు. అయితే అమరావతి కేసుతో పాటు ఆర్‌-5 జోన్‌ కేసును కలిపి విచారణ జరపాలని నిర్ణయిస్తూ.. అమ‌రావ‌తి కేసును విచారిస్తున్న జ‌స్టిస్ జోసెఫ్ ధ‌ర్మాస‌నం ముందు ఆర్-5 జోన్ పిటిష‌న్‌ను బ‌దిలీ చేయాల‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం ఆదేశించింది. శుక్ర‌వారంలోగానే రెండు పిటీష‌న్ల‌పై విచార‌ణ‌కు జ‌స్టిస్ జోసెఫ్ ధ‌ర్మాస‌నం ముందు లిస్ట్ చేయాల‌ని రిజ‌స్ట్రీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేసిన జగన్ సర్కారు, క్రిమినల్‌ లా అమెండ్మెంట్‌ 1944 చట్టం ప్రకారం అటాచ్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరిన సీఐడీ

ఆర్‌-5 జోన్‌పై రైతులు దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు విముఖత చూపుతూ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో రైతులు ఎస్‌ఎల్పీ దాఖలు చేశారు.

గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని.. తగిన ఉత్తర్వులు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌ను రైతులు వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివైస్ నేతృత్వంలోని ధర్మాసనం రైతులకు అవకాశం కల్పించింది.

సుప్రీం ధర్మాసనం కల్పించిన అవకాశం మేరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరావతి రైతులు సుప్రీంలో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్జిస్ రాజేశ్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచార‌ణ‌ జరిగింది. వాదనల తర్వాత అమ‌రావ‌తి కేసుతో పాటు ఆర్-5 జోన్ కేసును క‌లిపి వినాల‌ని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది.