Amaravati, June 15: టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. కరకట్టపై ఆయన గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు.సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు, మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నారు.
సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడి.. బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని అభియోగాలున్నాయి. చట్టాలను, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారంటూ విచారణలో తేలింది.తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగాలున్నాయి.
వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసింది. స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్‌ను అటాచ్ చేసింది.
ఈ గెస్ట్‌హౌస్‌తో పాటు నారాయణ బంధువుల ఆస్తులు, బ్యాంకు ఖాతాల్లో డబ్బును సీఐడీ అటాచ్ చేసింది. నారాయణ కుటుంబసభ్యులు, బినామీలకు చెందిన 75,880 చదరపు అడుగుల ఆస్తులు అటాచ్ చేసింది. నారయణ భార్య రమాదేవి, అల్లుడు పునీత్ ఆస్తులు ఇందులో ఉన్నాయి.