Vijayawada, May 15: ఆంధ్రప్రదేశ్ లోని (Andhrapradesh) కోస్తా ప్రాంతంలో (Coastal Area) మండే ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎర్రటి ఎండలకు వడగాలులు (Heat Waves) తోడవడంతో నిన్న కోస్తాంధ్ర (Coastal Andhra) కుతకుత ఉడికిపోయింది. ఎండలకు తట్టుకోలేని జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా రోడ్లు బోసిపోయి కనిపించాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడగాలులు జనాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి. బంగాళాఖాతంలో ఉన్న తుపాను దిశగా పడమర వైపు నుంచి వీచిన గాల్లో తేమ లేకపోవడంతో ఎండ మండిపోయింది.
ఈ రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల వరకు
నేడు, రేపు కూడా పరిస్థితి ఇలానే ఉంటుందని, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాలో వచ్చే రెండు మూడు రోజుల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.