Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, నో ఫోన్‌ జోన్లుగా పరీక్షా కేంద్రాలు, విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాని తెలిపిన ఇంటర్‌ బోర్డు

ఏపీలో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు (AP Intermediate examinations) శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు జరిగే పరీక్షలకు ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్‌ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, నో ఫోన్‌ జోన్లుగా పరీక్షా కేంద్రాలు, విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాని తెలిపిన ఇంటర్‌ బోర్డు
Representational Image | (Photo Credits: PTI)

Amaravati, May 6: ఏపీలో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు (AP Intermediate examinations) శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు జరిగే పరీక్షలకు ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్‌ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నిర్దేశిత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 9 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల సందర్భంగా నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్‌ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్తలు (makes all arrangements) చేపట్టారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పరీక్ష కేంద్రాల్లో (AP Inter Exams 2022) అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్‌ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్‌ పరీక్షలను పర్యవేక్షించనున్నాయి. ఆయా జిల్లాల ఎస్పీలు ఇప్పటికే పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

 చదువు దేశ చరిత్రను మారుస్తుంది, ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు పిల్లలను చదువుకు దూరం చేయకూడదని అప్పుడే అనుకున్నా, విద్యాదీవెన నగదు జమ కార్యక్రమంలో సీఎం జగన్

నో ఫోన్‌ జోన్లుగా పరీక్ష కేంద్రాలు

సెల్‌ఫోన్ల ద్వారా ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి షేర్‌ చేయకుండా అన్ని పరీక్ష కేంద్రాలను అధికారులు ‘నో ఫోన్‌ జోన్లు’గా ప్రకటించారు. చీఫ్‌ సూపరింటెండెంట్లతో సహా ఏ ఒక్కరూ ఫోన్లు, ఇతర డిజిటల్‌ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. ప్రశ్నపత్రాలను ఆయా పోలీసుస్టేషన్ల నుంచి తీసుకొనే సమయంలో ఆయా విభాగాల అధికారులు, ఇతర సిబ్బంది వారి సెల్‌ఫోన్లను పోలీసుస్టేషన్లలో డిపాజిట్‌ చేయాలని బోర్డు ఆదేశించింది. అలాగే పరీక్షల విధుల్లో ఉండే టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది కూడా తమ సెల్‌ఫోన్లను చీఫ్‌ సూపరింటెండెంట్ల వద్ద డిపాజిట్‌ చేయాలి. పోలీస్‌స్టేషన్ల నుంచి తెచ్చిన ప్రశ్నపత్రాల బండిళ్లను సీసీ కెమెరాల ఎదుటనే విప్పి వాటిని విద్యార్థులకు అందిస్తారు. అలాగే సమాధాన పత్రాలను బండిళ్లుగా కట్టే పనిని కూడా సీసీ కెమెరాల ముందే చేయాలి.

(The above story first appeared on LatestLY on May 06, 2022 11:08 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).