Andhra Pradesh Blast: అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం, ఏడుగురి పరిస్థితి విషమం, 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలిపోయిందని తెలిపిన డాక్టర్లు

అచ్యుతాపురం సెజ్‌లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. సాహితీ ఫార్మా కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు కింగ్‌జార్జ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు

Andhra Pradesh Blast: అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం, ఏడుగురి పరిస్థితి విషమం, 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలిపోయిందని తెలిపిన డాక్టర్లు
Blast at Pharma Company in Andhra Pradesh (Photo Credit: Twitter)

అచ్యుతాపురం సెజ్‌లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. సాహితీ ఫార్మా కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు కింగ్‌జార్జ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కంపెనీలోని రెండు రియాక్టర్లు పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటల్ని అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు.

ఘటనపై అనకాపల్లి ఎస్పీ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. సాహితీ ఫార్మా కంపెనీలోప్రమాదం జరిగిందన్నారు. సమాచారం రాగానే తమ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. కంపెనీలో 35 మంది కార్మికులు విధుల్లో ఉండగా.. 28 మంది బయటకు వచ్చేశారని పేర్కొన్నారు. ఏడుగురికి తీవ్ర గాయలవ్వగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌ సాహితీ ఫార్మాలో భారీ పేలుడు, ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లుగా వార్తలు 

మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు అంటుకుంటాయని కార్మికులు ఆందోళన చెందారు. సాహితీ ఫార్మా చుట్టుపక్కలకు దట్టమైన పొగలు వ్యాపించాయి. మరో రెండు గంటల్లో మంటలు అదుపులోకి వస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.

సాహితీ ఫార్మా కంపెనీలో గాయపడిన వారందరి పరిస్థితి విషమంగా ఉందని కింగ్‌జార్జ్‌ ఆసుపత్రి సూపరిండెంట్ శివానంద తెలిపారు. మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. వారందరికీ దాదాపుగా 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలిపోయిందని చెప్పారు. ఒడిశా భువనేశ్వర్‌కు చెందిన రమేష్ (45),రాంబిల్లి మండలం జనగాలపాలేనికి చెందిన సత్తిబాబు (35), రాంబిల్లి మండలం అప్పారాయుడుపాలెం వాసి నూకి నాయుడు (40), విజయనగరానికి చెందిన తిరుపతికి(40)తీవ్రగాయాలు అయ్యాయి. నక్కపల్లి మండలం రెబ్బాకకు చెందిన రాజుబాబు, నక్కపల్లికి చెందిన అప్పారావు (43), అనకాపల్లి జిల్లా కొండకొప్పాకకు చెందిన పిల్లా సంతోష్ కుమార్‌, గాయపడ్డారు.

(The above story first appeared on LatestLY on Jun 30, 2023 05:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).