Andhra Pradesh Cabinet Meeting: మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపుకు ఏపీ కేబినెట్ ఆమోదం, ఏపీ మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలు ఇవే..
ఈ రోజు (సోమవారం) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశంలో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు కేబినెట్ సమావేశం ఆమోదించింది.
Amaravati, June 24: ఈ రోజు (సోమవారం) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశంలో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు కేబినెట్ సమావేశం ఆమోదించింది. డీఎస్సీలో 16,347 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, పెన్షన్ కూడా నాలుగు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు క్యాబినెట్ ముందుంచారు. జులై ఒకటి నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
అనంతరం పింఛన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం రూ.3వేల నుంచి రూ.4లకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జులై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడునెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7వేల పింఛను అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

