PNB Case:  బ్యాంకులో రూ.42.79 కోట్ల మోసం కేసు, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధించిన సీబీఐ కోర్టు

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ (CBI Arrests Araku Ex- MP Kothapalli Geetha) చేశారు.హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అధికారులు గీతను బెంగళూరుకు తరలించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రుణం తీసుకుని రుణం చెల్లించని కేసులో గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

PNB Case:  బ్యాంకులో రూ.42.79 కోట్ల మోసం కేసు, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధించిన సీబీఐ కోర్టు
kothapalli-geetha (Photo-Video Grab)

Hyd, Sep 15: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ (CBI Arrests Araku Ex- MP Kothapalli Geetha) చేశారు.హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అధికారులు గీతను బెంగళూరుకు తరలించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రుణం తీసుకుని రుణం చెల్లించని కేసులో గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత (Ex- MP Kothapalli Geetha) దంపతులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రూ.42.79 కోట్లు రుణం తీసుకున్నారు. దీనిపై పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ కంపెనీ పేరుతో లోన్‌ తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంక్‌ అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి.

అయితే ఈ రుణం చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు గీత దంపతులపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు గీతను అరెస్ట్ చేశారు. గీతను అరెస్ట్ చేసి బెంగళూరుకు సీబీఐ అధికారులు తరలించారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో రుణం తీసుకున్న డబ్బుని దారి మళ్లించారనే అభియోగాలతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. దీంట్లో భాగంగా కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సీబీఐ కోర్టు రూ.2లక్షల జరిమానా విధించింది. గీత భర్త పి.రామకోటేశ్వరరావుకు కూడా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష ఫైన్ వేసింది.

అమిత్ షా హైదరాబాద్ షెడ్యూల్ ఖరారు, తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16న తెలంగాణ రాజధానికి రానున్న కేంద్ర హోం మంత్రి

ఈ స్కామ్‌కు సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కూ ఐదేళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. శిక్షలు ఖరారు కావడంతో కొత్తపల్లి గీత సహా నిందితులను బుధవారం సీబీఐ అదుపులోకి తీసుకుంది.ప్రస్తుతం వైద్యపరీక్షల కోసం గీతను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా తెలంగాణ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు గీత.

(The above story first appeared on LatestLY on Sep 14, 2022 02:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).