CM Jagan Slams Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలపై సీఎం జగన్ మళ్లీ సెటైర్స్, కార్లను మార్చినట్లు వారిని మారుస్తాడని ఎద్దేవా, వాళ్లను నాయకుల్ని చేస్తే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటి అంటూ సూటి ప్రశ్న
జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు
AP CMO Press Meet: జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ఆ వేదిక మీద ప్రతిపక్ష నేతల తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు.
ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని వ్యక్తి. మరొకరు ఆ వ్యక్తికి కొమ్ము కాసే వ్యక్తి. ఈ ఇద్దరు ఇప్పుడు ఏకమై ప్రజల్ని వంచించేందుకు సిద్ధం అయ్యారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కల్యాణ్‌లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.పద్నాలుగేళ్లు ఏళ్లు పాలించిన వ్యక్తి చేసిన మంచి చెప్పి ఓట్లు అడగాలి. అమ్మ ఒడి కంటే మెరుగైన పథకం అమలు చేసి ఉంటే.. అది చెప్పి ఓట్లు అడగాలి.
ఇప్పుడు అమలు చేస్తున్న వాటి కంటే మెరుగైన పథకాల్ని అమలు చేసి ఉంటే వాటి గురించి చెప్పి ఓట్లు అడగాలి. ఆయన పాలించిన 14 ఏళ్లు ఏం చేశారో చెప్పని వ్యక్తి.. పాదయాత్ర ముగింపు సభలో మాత్రం మాట్లాడాడు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన పాలనను చూశారు. మీ బిడ్డ నాలుగున్నర సంవత్సరాల పాలన చూశారు. కానీ, కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామమైనా చూసుకోండి.
గ్రామ సచివాలయం పెట్టింది ఎవరంటే జగనే గుర్తొస్తాడు. వలంటీర్ వ్యవస్థతో ఒకటో తేదీన మీ ఇళ్లకే పెన్షన్ అందిస్తోంది మీ జగన్. గ్రామస్థాయిలోనే విలేజ్ క్లినిక్‌లు పెట్టింది మీ జగన్. పౌర సేవల్ని తెచ్చింది మీ జగన్. పొదుపు సంఘాలకు జీవం పోసిందెవరంటే గుర్తొచ్చేది మీ జగన్. అక్కాచెల్లెళ్లకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తోంది మీ జగన్. బాబు కంటే మూడు రెట్లు పఫించన్ పెంచింది ఎవరంటే గుర్తొచ్చేది మీ జగన్. ఇంతకన్నా మంచి చేసి ఉంటే అది చెప్పి ఓట్లు అడగాలి.
ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి.. ఇది ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇవన్నీ చూస్తే ఎంత కడుపు మండుతుంది. ఎన్ని జలసిల్ మాత్రలు ఇస్తే కడుపుమంట తగ్గుతుంది. అందుకే వారు బాబు అనే చిన్న గీతను పెద్దది చేయలేరు కాబట్టి మనం చేసిన సంక్షేమం, అభివృద్ధి అనే పెద్ద గీతను చెరిపేందుకు ప్రయత్నిస్తున్నారు.
బాబు చేయని అభివృద్ధి ప్రజలకు గుర్తు ఉండకూడదు, జగన్ ఇంటింటికీ చేసిన మంచిని ప్రజలు మర్చిపోవాలి ఇందుకోసమే ఈరోజు ఈ దిక్కుమాలిన రాతలు. దిక్కుమాలిన కథలు. దిక్కుమాలిన కథనాలు. ఉద్యోగస్తులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు, రౌండ్ టేబుళ్లు, రకరకాల పార్టీలు, వ్యక్తల రంగ ప్రవేశాలు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. తోడేళ్లందరూ ఏకమై ఒక్క జగన్ మీద ఏకమై యుద్ధం చేస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు. కారణం.. ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు. వీళ్లందరూ కూడా నమ్ముకున్నది వంచనను, మోసాన్ని.
.. పక్క వ్యక్తిని ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ పెట్టేవారు ఎవరూ ఉండరు. రియల్ లైఫ్‌లో ఏ భార్యతో నాలుగేళ్లు కలిసి ఉండడు. మ్యారేజ్ స్టార్ ఆడవాళ్లను ఆటవస్తువులుగా చూస్తాడు. పెళ్లి అనే సంప్రదాయాన్ని మంట గలిపాడు. ఇప్పటికే ముగ్గురు భార్యాలను మార్చాడు. కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తాడు. ఇలాంటి వాళ్లను నాయకుల్ని చేస్తే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటి?. ఇలాంటి వాళ్లకు ఓటేయడం ధర్మమేనా?.
చంద్రబాబుకిగానీ, పవన్‌కల్యాణ్‌కి గానీ ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు. దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు. ప్యాకేజీ కోసం తన వర్గాన్ని త్యాగం చేసిన త్యాగాల త్యాగరాజు. భార్యతో మూడేళ్లు ఉండడు. కానీ, చంద్రబాబుతో 15 ఏళ్ల బంధం కావాలని అంటాడు. దత్తపుత్రుడికి ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే.. ఇవ్వకున్నా ఓకే. ప్రజల కోసం త్యాగాలు చేసేవారిని చూశాం కానీ ప్యాకేజీ కోసం త్యాగాలు చేసేవాళ్లను ఇప్పుడే చూస్తున్నాం. భీమవరం ఓడించిన దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఉంటున్నాడు.
అన్ని వర్గాలను వంచించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ హామీలతో వస్తున్నాడు. అమలు చేసిన మంచిగానీ, మంచి స్కీములుగానీ ఇవేవీ లేవు కాబట్టే ఏకంగా మోసాలకు, ఈరోజు మేనిఫెస్టో అట.. ఇద్దరూ కలిసి ఇస్తారట. రంగు రంగుల వలలతో ప్రజల్నిమోసం చేసేందుకు వస్తారు. కొత్తగా మరిన్ని వాగ్దానాలతో వస్తున్నాడు. ఆరు గ్యారెంటీలన్నాడు. జగన్ ను ఢీకొట్టలేమని డిసైడ్ చేసుకొని ఉమ్మడి మేనిఫెస్టో అని ప్రజల్ని మోసం చేయాలని బయల్దేరారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తారట. ఇలాంటి వారిని నమ్మవచ్చా? అని ఆలోచన చేయాలి.
ఇలాంటి వారిని చూసినప్పుడు వేమన పద్యం గుర్తుకు వస్తుంది. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలుపేగానీ తెలుపు కాదు.. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా? విశ్వదాభిరామ, వినురవేమ అని. రెండు విషాలు(చంద్రబాబు, పవన్‌ను ఉద్దేశించి..) కలిస్తే అమృతం అవుతుందా? నలుగురు ఒక్కటవుతే కౌరవుల సంఖ్య పెరగుతుంది అంతే.. అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.
ప్రజలకు వాళ్లు చేసింది ఏమీ లేదు కాబట్టే మోసాల్ని వంచల్ని మాత్రమే నమ్ముకున్నారు. అధికారం కోసం ఎన్ని మోసాలైనా చేస్తారు. వీరి బుద్ధి ఎలాంటిదో గమనించాలని అడుగుతున్నా. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవుడి దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు.
(The above story first appeared on LatestLY on Dec 29, 2023 02:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

