146 New Ambulances in AP: 146 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్, 108 సేవల కోసం ఏటా రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం
వైద్యరంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కారు మరో దిశగా ముందడుగు వేసింది. 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది
Tadepalli, July 3: వైద్యరంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కారు మరో దిశగా ముందడుగు వేసింది. 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. ఈ అంబులెన్స్‌లను సోమవారం సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం వద్ద ప్రారంభించారు.
కాగా 2020లోనే మండలానికి ఒక 108 అంబులెన్స్‌ను ఏపీ ప్రభుత్వం సమకూర్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా అప్పట్లో రూ.96.50 కోట్లతో అధునాతన సౌకర్యాలతో 412 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేసి, అప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేసి 748 అంబులెన్స్‌లతో సేవలను విస్తరించారు. గత అక్టోబర్‌లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం రూ.4.76 కోట్లతో ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్సులు కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది.
ఎక్కువకాలం ప్రయాణించి దెబ్బతిన్నస్థితిలో ఉన్నవాటి స్థానంలో కొత్త అంబులెన్సులను ప్రవేశపెట్టడం కోసం తాజాగా రూ.34.79 కోట్లతో 146 అంబులెన్స్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరోవైపు 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం సేవలు ఎంతో మెరుగుపడ్డాయి. అప్పట్లో 1.19 లక్షల మందికి ఒక అంబులెన్స్ ఉండగా ప్రస్తుతం 74,609 మంది జనాభాకు ఒక అంబులెన్స్ ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లు రోజుకు 3,089 కేసులకు అటెండ్ అవుతున్నాయి. ఇలా 2020 జూలై నుంచి ఇప్పటి వరకు 33,35,670 ఎమర్జెన్సీ కేసుల్లో అంబులెన్స్‌లు సేవలందించాయి. సేవలు వినియోగించుకున్న వారిలో అత్యధికంగా 23%మంది మహిళలే. అనంతరం 12% మంది కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు, 11% మంది రోడ్డు, ఇతర ప్రమాదాల బాధితులు ఉన్నారు.
(The above story first appeared on LatestLY on Jul 03, 2023 11:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

