ACB 14400 Mobile App: ఎవరైనా ఎక్కడైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ 14400కు కాల్ చేయండి, ACB 14400 Mobile Appను ప్రారంభించిన సీఎం జగన్, యాప్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి

ఏపీలో అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను (ACB 14400 Mobile App) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. గతంలో సీఎం ఆదేశాలమేరకు ఏసీబీ ఈ యాప్‌ తయారు చేసింది. స్పందనపై నిర్వహించిన సమీక్షలో సీఎం.. యాప్‌ను (CM YS Jagan launches ACB App) ప్రారంభించారు.

ACB 14400 Mobile App: ఎవరైనా ఎక్కడైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ 14400కు కాల్ చేయండి, ACB 14400 Mobile Appను ప్రారంభించిన సీఎం జగన్, యాప్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి
ACB 14400 Mobile App (Photo-APCMO Twitter)

Amaravati, June 1: ఏపీలో అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను (ACB 14400 Mobile App) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. గతంలో సీఎం ఆదేశాలమేరకు ఏసీబీ ఈ యాప్‌ తయారు చేసింది. స్పందనపై నిర్వహించిన సమీక్షలో సీఎం.. యాప్‌ను (CM YS Jagan launches ACB App) ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఒకటే మాట చెబుతున్నామని.. ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట చాలా స్పష్టంగా చెప్పామన్నారు. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.

చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని లాంటి అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా పంపాం. ఎక్కడైనా, ఎవరైనా కూడా.. కలెక్టరేట్‌ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్‌ అయినా, వాలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే.. ఎవరైనా చేయాల్సింది ఒక్కటే.

రుషి కొండలో నిర్మాణాలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్, తదుపరి విచారణ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు, కేసులోని మెరిట్స్‌పై తామెలాంటి వ్యాఖ్య‌లు చేయ‌ద‌ల‌చుకోలేద‌ని స్పష్టం

తమ చేతుల్లోని ఫోన్‌లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్‌ చేసి... బటన్‌ ప్రెస్‌చేసి వీడియోద్వారా కాని, ఆడియోద్వారా కాని సంభాషణను రికార్డు చేయండి.. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుందని సీఎం తెలిపారు.

యాప్‌ ఎలా పనిచేస్తుందంటే...:

♦పౌరులు నేరుగా యాప్‌ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం

♦గూగుల్‌ ప్లే స్టోర్‌లో యాప్‌

♦యాప్‌ డౌన్లోడ్‌ చేయగానే మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ

♦ఓటీపీ రిజిస్టర్‌ చేయగానే వినియోగానికి యాప్‌ సిద్ధం

♦యాప్‌లో 2 కీలక ఫీచర్లు

♦యాప్‌ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్‌రిపోర్ట్‌ ఫీచర్‌ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం

♦లాడ్జ్‌ కంప్లైంట్‌ ఫీచర్‌ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించి.. ఫిర్యాదుకు తనదగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం

♦ఫిర్యాదు రిజిస్టర్‌ చేయగానే మొబైల్‌ ఫోన్‌కు రిఫరెన్స్‌ నంబరు

♦త్వరలో ఐఓఎస్‌ వెర్షన్‌లోనూ యాప్‌ను సిద్ధంచేస్తున్న ఏసీబీ

(The above story first appeared on LatestLY on Jun 01, 2022 09:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).