Andhra Pradesh: ఇకపై జగనన్న గారూ అనే పిలుస్తానని తెలిపిన షర్మిల, రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని సవాల్, వీడియోలు ఇవిగో..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇకపై జగనన్న గారూ అనే సంబోధిస్తానంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. జగన్ రెడ్డి గారూ అని పిలిస్తే అధికార పార్టీ నేతలకు నచ్చడంలేదని, అందుకే ఇకపై జగనన్న గారూ అనే పిలుస్తానని చెప్పారు.
- Read in
- తెలుగు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇకపై జగనన్న గారూ అనే సంబోధిస్తానంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. జగన్ రెడ్డి గారూ అని పిలిస్తే అధికార పార్టీ నేతలకు నచ్చడంలేదని, అందుకే ఇకపై జగనన్న గారూ అనే పిలుస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల.. మంగళవారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా పలాస సమీపంలో షర్మిల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి, సమస్యల గురించి ఆరా తీశారు.
బస్సు ప్రయాణంలోనే షర్మిల మీడియాతో మాట్లాడారు. వైవీ సుబ్బారెడ్డి గారికి తాను జగన్ రెడ్డి అనడం నచ్చలేదని చెబుతూ.. ఇకపై జగనన్న గారూ అనే సంబోధిస్తానని సుబ్బారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా సరే అధికార పార్టీ చేసిన అభివృద్ధి చూపించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతమైనా.. ఏ రోజు.. ఏ సమయంలోనైనా వచ్చి చూసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Here's Videos
#WATCH | Andhra Pradesh Congress chief YS Sharmila interacts with travellers in a bus in Srikakulam. pic.twitter.com/MHZ2irPLKf
— ANI (@ANI) January 23, 2024
VIDEO | Andhra Pradesh Congress president YS Sharmila interacts with passengers as she travels in an APSRTC bus from Palasa to Ichhapuram in Srikakulam district.
(Source: Third Party) pic.twitter.com/HR3T6Ge1x5
— Press Trust of India (@PTI_News) January 23, 2024
వైవీ సుబ్బారెడ్డి కి ప్రతి సవాల్ విసిరిన APCC చీఫ్ వైస్ షర్మిలా రెడ్డి..!!#YSSharmila #YSSharmilaHittingJagan #YVSubbareddy #APCC #Congress #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/9koHsaF8Lv
— oneindiatelugu (@oneindiatelugu) January 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 23, 2024 02:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

