Andhra Pradesh: మెడికో ప్రియాంకను కారుతో గుద్దిన వీడియోలు ఇవిగో.. చికిత్స పొందుతూ పీజీ వైద్య విద్యార్థిని మృతి..కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తండ్రి..
మద్యం మత్తులో ఇద్దరు యువకులు నిర్లక్ష్యంగా కారు నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక (28) చికిత్స పొందుతూ కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం 3.32 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Andhra Pradesh: మద్యం మత్తులో ఇద్దరు యువకులు నిర్లక్ష్యంగా కారు నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక (28) చికిత్స పొందుతూ కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం 3.32 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థిని మృతి చెందడంతో రాజమహేంద్రవరం పోలీసులు ఈ కేసును బీఎన్‌ఎస్ (BNS) సెక్షన్ 106 కింద హత్యానేరంగా మార్చారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో ప్రియాంక పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఈ నెల 3న రాత్రి రాజమహేంద్రవరంలోని ఒక మాల్‌లో సినిమా చూసి.. తన సహచర విద్యార్థితో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా నామవరానికి చెందిన సురవరపు దశ్వంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ మద్యం మత్తులో కారుతో వీరి వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం కారును ఆమెపై నుంచి పోనివ్వడంతో తలకు తీవ్ర గాయమైంది. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసిన APSDMA
ఈ విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం ప్రకటిస్తూ.. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.
Dr Kanike Priyanka Dies After Week-Long Battle for Survival
ఏడ్చి ఏడ్చి నా కంట్లో నీళ్ళు ఆవిరి అయిపోయాయని చెబుతున్న ప్రియాంక తండ్రి కడుపుకోత తీర్చేది ఎవరు?
సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కారుతో రెండుసార్లు గుద్ది మూడోసారి తొక్కించి స్పందించకుండా వెళ్లిపోయినట్లు కనిపిస్తున్నా నిందితుల మీద కేసు పెట్టకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేశారు? pic.twitter.com/nxGFYSlAgx
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2026
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీకు ఆడపిల్లలు లేరా!
ప్రతి నెలా హైదరాబాద్ వస్తారు కదా... మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా?
మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్న డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్
చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నా బిడ్డ గురించి ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు… https://t.co/qcjJb64H8x pic.twitter.com/MMSUqivNj3
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2026
ప్రియాంక స్వస్థలం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్‌పూర్. తమ కుటుంబంలో తొలి డాక్టర్ కాబోతున్న కుమార్తెను మద్యం మత్తులో కారు నడిపిన యువకులు పొట్టనబెట్టుకున్నారని, చట్టాలను మరింత కఠినతరం చేసి తమకు న్యాయం చేయాలని ప్రియాంక తండ్రి వెంకటేశ్ కన్నీరుమున్నీరయ్యారు.
(The above story first appeared on LatestLY on Aug 10, 2026 09:00 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

