Andhra Pradesh Elections 2024: అనూహ్య మార్పులతో వైసీపీ మూడో జాబితా విడుదల, పెడన నుంచి పెనమలూరుకు మారిన జోగి రమేష్, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం
మొత్తం 175కు 175 సీట్ల గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న వైసీపీ పార్టీ తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 స్థానాలకు ఇన్‌ఛార్జిలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో జాబితాలో ఆరు పార్లమెంట్ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది.
Vjy, Jan 11: మొత్తం 175కు 175 సీట్ల గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న వైసీపీ పార్టీ తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 స్థానాలకు ఇన్‌ఛార్జిలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో జాబితాలో ఆరు పార్లమెంట్ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా మూడో జాబితాను విడుదల చేసింది.ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నానికి వైసీపీ ఇన్‌ఛార్జిల మూడో లిస్ట్‌లో చోటు దక్కింది.
విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా ఇదిగో..
తాడేపల్లిలో గురువారం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలను మీడియాకు తెలియజేశారు. శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తూ.. ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ మూడో జాబితాను రూపొందించారు.వీటితో పాటు ప్రస్తుతం ఇచ్ఛాపురం జెడ్పీటీసీగా ఉన్న ఉప్పాడ నారాయణమ్మను.. శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం ఈమేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
కొత్తగా నియమితులైన పార్లమెంట్ ఇన్‌ఛార్జిలు వీరే..
విశాఖపట్నం - బొత్స ఝాన్సీ
విజయవాడ - కేశినేని నాని
కర్నూలు - గుమ్మనూరు జయరాం
ఏలూరు - కారుమూరు సునీల్ కుమార్
తిరుపతి - కోనేటి ఆదిమూలం
శ్రీకాకుళం - పేరాడ తిలక్
అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు వీరే..
ఇచ్ఛాపురం - పిరియ విజయ
టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి (ఎస్సీ) - కంభం విజయరాజు
రాయదుర్గం - మెట్టు గోవిందరెడ్డి
దర్శి - బూచేపల్లి శివప్రసాదరెడ్డి
పూతలపట్టు (ఎస్సీ) - మూతిరేవుల సునీల్ కుమార్
చిత్తూరు - విజయానందరెడ్డి
మదనపల్లె - నిస్సార్ అహ్మద్
రాజంపేట - ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి
ఆలూరు - బూసినే విరూపాక్షి
కోడుమూరు (ఎస్టీ) - డాక్టర్ సతీష్
గూడూరు (ఎస్సీ) - మేరిగ మురళి
సత్యవేడు (ఎస్సీ) - మద్దిల గురుమూర్తి
పెనమలూరు - జోగి రమేష్
పెడన - ఉప్పాల రాము
(The above story first appeared on LatestLY on Jan 11, 2024 09:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

