Andhra Pradesh: భూవివాదం, కర్నూలులో ఇద్దరిని వేట కొడవళ్లతో నరికి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రత్యర్థులు,

ఏపీలో కర్నూలు జిల్లా కైతాలం మండలంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. శివప్ప. ఈరప్ప, అనే ఇద్దరిని ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి పెట్రోల్ పోసి (Faction fight leaves 2 dead in Kurnool) నిప్పంటించారు.

Andhra Pradesh: భూవివాదం, కర్నూలులో ఇద్దరిని వేట కొడవళ్లతో నరికి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రత్యర్థులు,
Murder (Photo Credits: Pixabay)

Amaravati, Jan 27: ఏపీలో కర్నూలు జిల్లా కైతాలం మండలంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. శివప్ప. ఈరప్ప, అనే ఇద్దరిని ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి పెట్రోల్ పోసి (Faction fight leaves 2 dead in Kurnool) నిప్పంటించారు. గ్రామంలో మల్లిఖార్జున, శివప్పల మధ్య గత కొంత కాలం నుంచి భూతగదాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈ రోజు భూవిషయమై చర్చించుకునేందుకు ఇరువర్గాలు సమావేశమయ్యాయి.

ఈ సమావేశంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మల్లిఖార్జునకు చెందిన వ్యక్తులు కళ్లలో కారం కొట్టి, వేట కొడవళ్లతో శివప్ప, ఈరన్నలపై దాడి చేసి నిప్పంటించారు. ఈ ఘటనలో శివప్ప స్థలం వద్ద చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ ఈరన్నను అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయారు. ఈ సంఘటనలో మరొకరికి తీవ్ర గాయాలు కావడంతొ ఆస్తపత్రిలో చేర్చారు. కాగా వీరిలో శివప్ప వర్గం వైసీపీలో, మల్లికార్జున వర్గం బీజేపీలో కొనసాగుతోంది.

(The above story first appeared on LatestLY on Jan 27, 2022 04:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).