Andhra Pradesh Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలో నలుగురు అక్కడికక్కడే మృతి, అదుపుతప్పి లారీని డీకొట్టిన కారు
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడూరుపాడు వద్డ జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది.
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడూరుపాడు వద్డ జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న స్వామినాథన్ (40), రాకేష్ (12), రాధప్రియ (14), గోపి(23) అక్కడిక్కడే మృతి చెందగా సత్య (28) (స్వామినాథన్ భార్య ) తీవ్రంగా గాయపడింది. దీంతో, ఆమెను వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు, ఎనిమిది మంది మృతి, పలువురికి గాయాలు, వీడియోలు ఇవిగో..
ఇక, వీరంతా కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కాగా, ప్రమాదంలో మృతుందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో స్థానికంగా విషాదఛాయలు అములుకున్నాయి. మరోవైపు.. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై వివరాలను సేకరిస్తున్నారు
(The above story first appeared on LatestLY on May 27, 2024 01:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

