Chittoor Road Accident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన లారీ, నలుగురు అక్కడికక్కడే మృతి, బెంగళూరు నుంచి నెల్లూరుకు వస్తుండగా బంగారుపాళెం వద్ద విషాద ఘటన
చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం (Chittoor Road Accident) చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బంగారుపాళెం మండలం మొగలి వద్ద ఇవాళ ఉదయం ఓ లారీ అదుపు తప్పి కారును ఢీకొంది. అనంతరం ద్విచక్ర వాహనంపై దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు, బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు బెంగుళూరుకు చెందిన వారు.
Chittoor, August 30: చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం (Chittoor Road Accident) చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బంగారుపాళెం మండలం మొగలి వద్ద ఇవాళ ఉదయం ఓ లారీ అదుపు తప్పి కారును ఢీకొంది. అనంతరం ద్విచక్ర వాహనంపై దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు, బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు బెంగుళూరుకు చెందిన వారు.
వీరంతా బెంగళూరు నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు శ్రీనివాసులు, రత్నమ్మ, వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. మరొకరు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ప్రమాదంలో టిప్పర్‌కు.. కారుకు మధ్య ఉన్న ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదానికి గురైన కారు కర్ణాటక రిజిస్ట్రేషన్‌కు సంబంధించింది అని స్థానికులు చెబుతున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.
(The above story first appeared on LatestLY on Aug 30, 2020 12:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

