Andhra Pradesh: ముందస్తు బెయిల్ కోరుతూ పేర్ని నాని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్, విచారించేందుకు అంగీకరించిన ఏపీ హైకోర్టు
తమ గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు చేర్చారు.
Vjy, Dec 31: తమ గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు చేర్చారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.
పేర్ని నాని పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ మధ్యాహ్నం 2 గంటల తర్వాత పిటిషన్ ను విచారించనుంది. మరోవైపు, ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరయింది. కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురు మాత్రం మచిలీపట్నం సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు.గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లయీస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావు, లారీ డ్రైవర్ స్నేహి తుడు ఆంజనేయులును అరెస్టు చేశారు. వీరికి జడ్జీ 12 రోజులు రిమాండ్ విధించారు.
కాగా పేర్ని నాని సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ రాగానే పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కోటి 68 లక్షలు పేర్ని నాని కుటుంబం చెల్లించింది. మరో కోటి 67 లక్షలు రికవరీ చెల్లించాలంటూ జయసుధకు కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు పంపించారు. జయసుధకు ముందస్తు బెయిల్ రాగానే పేర్ని నానిని ఏ6గా కేసులో పోలీసులు చేర్చారు.
(The above story first appeared on LatestLY on Dec 31, 2024 02:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

