Hyderabad, Dec 31: దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నిలిచారు. చంద్రబాబు నాయుడుకు అత్యధికంగా రూ.931 కోట్ల ఆస్తి ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) (ADR) పేర్కొన్నది. దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో కూడిన నివేదికను సోమవారం ఏడీఆర్ విడుదల చేసింది. ముఖ్యమంత్రులు అందరిలో తక్కువ ఆస్తి కలిగిన సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. ఆమెకు రూ.15 లక్షలు మాత్రమే ఉన్నట్టు నివేదిక వివరించింది. సీఎంల సగటు ఆదాయం ఏడాదికి రూ.13,64,310. ఇది దేశ సగటు తలసరి ఆదాయం కంటే 7.3 రెట్లు అధికంగా ఉన్నది.
✍️అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక ప్రకారం
👉రూ. 931 కోట్లకు పైగా ఆస్తులుతో భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి. ఎన్ చంద్రబాబు నాయుడు (ఆంధ్ర ప్రదేశ్)...
👉రూ. 15 లక్షల ఆస్తులతో దేశంలోనే అత్యల్ప పేద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. (పశ్చిమ బెంగాల్)
For More Updates… pic.twitter.com/zIFpSc4S2f
— ChotaNews App (@ChotaNewsApp) December 31, 2024
మొత్తం ఆస్తి ఎంతంటే?
నివేదిక ప్రకారం దేశంలోని 31 ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి కలిపి రూ.1,630 కోట్లు ఉన్నట్టు సమాచారం. సీఎంల సగటు ఆస్తి రూ.52.59 కోట్లు ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది.
2025 తెలంగాణ ప్రభుత్వ సెలవులివే, అక్టోబర్ 3న దసరా..20న దీపావళి, పూర్తి వివరాలివే