Hyderabad, Dec 27: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో (AIIMS) తుది శ్వాస విడిచారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు నేడు సెలవు ప్రకటించింది. అలాగే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినాలు పాటించాలని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన రాజకీయ దురంధరుడు
మన్మోహన్సింగ్ మృతి
తెలంగాణలో నేడు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు సెలవు
వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ఉత్తర్వులు pic.twitter.com/KhnPWKyWTQ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 27, 2024
కేంద్ర మంత్రి మండలి భేటీ
మన్మోహన్ అస్తమయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. నేటి నుంచి ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర మంత్రి మండలి భేటీ కానుంది. కాగా, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు.