Former prime minister Manmohan Singh (File Image)

New Delhi, DEC 26: భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్(92) (Manmohan Singh) ఇక‌లేరు. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న్ను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ఆయ‌న చికిత్స పొందుతూ క‌న్నుమూశారు (Manmohan Singh Passes Away). ఆయ‌న మ‌ర‌ణ వార్త‌ను ప్రియాంక వాద్రా భ‌ర్త రాబ‌ర్డ్ వాద్రా సామాజిక మాద్య‌మం ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే కాసేప‌టికే ఆ ట్వీట్ ను ఆయ‌న డిలీట్ చేశారు. అటు ప‌లువురు సోషల్ మీడియాలో మ‌న్మోహ‌న్ కు నివాళులు అర్పిస్తున్నారు. అధికారిక వ‌ర్గాల నుంచి కానీ, ఎయిమ్స్ డాక్ట‌ర్ల నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

Former Prime Minister Has Passed Away, Says Robert Vadra

 

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పని చేశారు. ఈ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకు రావడంతో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ (Manmohan Singh Passes Away) అత్యంత కీలక పాత్ర పోషించారు. ఇక 2004లో నాటి యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేట్టారు. దాదాపు దశాబ్దం పాటు ఆయన దేశ ప్రధానిగా ఉన్నారు.

Manmohan Singh Health Update: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు తీవ్ర అస్వస్థత, ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు 

ఒక‌వైపు కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం బెల్గావీలో జ‌రుగుతోంది. రెండు రోజుల పాటూ స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి. అయితే మ‌న్మోహన్ మృతి నేప‌థ్యంలో అవి కొన‌సాగుతాయా? లేదా? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది.