CM Revanth Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత, జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో రేవంత్ సమావేశం
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ అంశం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
Hyd, Feb 5: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ అంశం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో(Congress MLAs) రేపు మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానున్నారు. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు.
ఎమ్మెల్యేలను నాలుగు గ్రూపులుగా చేసి వారితో చర్చించనున్నారు ముగ్గురు నేతలు. హైదరాబాద్ ఎంసీహెచ్‌ఆర్‌డీ(MCRHRD)లో ఈ సమావేశం జరగనుంది. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో వేర్వేరుగా భేటీ కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మధ్యాహ్నం 3 గం. నుండి 4. గం వరకు అదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. 4:15 నుండి 5:15 వరకు కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో మీటింగ్ జరగనుంది. వీడియో ఇదిగో, కుల గణన సర్వే రిపోర్ట్‌ని ఉచ్చ పోసి తగలబెట్టాలని మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే అంటున్నాడు, అసెంబ్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
5:30 నుండి 6:30 వరకు నల్గొండ, హైదరాబాద్, మెదక్ జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. 6:45 నుండి 7:45 వరకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
(The above story first appeared on LatestLY on Feb 05, 2025 01:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

