సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.సెంబ్లీలో బీసీ కుల గణన నివేదికపై చర్చ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి చారిత్రాత్మకమైన ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో కామారెడ్డి డిక్లరేషన్‌ తరహాలో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి బిల్లు ప్రవేశపెడతారేమోనని.. ఆ బిల్లును శాసనసభలో ఆమోదింప చేసి.. చట్టబద్ధత కల్పిస్తారేమోనని రాష్ట్రవ్యాప్తంగా బలహీన వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ, ముఖ్యమంత్రి లేచి నాలుగు పేర్లు చదువుతున్నారు. మీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్‌రెడ్డి గారు మీరే చెప్పారు’ అంటూ విమర్శించారు.

అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, ఈ  డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడుతామని వెల్లడి

ఈ నివేదిక అంతా తప్పుల తడక అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తగలబెట్టాలని చెబుతున్నడు. రాష్ట్రవ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెబుతున్నయ్‌. సమగ్ర కుటుంబ సర్వేలో 1.85కోట్లు ఉన్న బీసీలు ఎట్లా 1.64లక్షలకు తగ్గారు.. 51శాతం 46శాతం ఎట్లయ్యిందని అడుగుతున్నరు. శంకర్‌ అన్న కూడా అదే అడిగిండు.. అందులో తప్పు ఏముంది. ఆయనే కాదు.. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నడు. మీరిచ్చిన నివేదికను తగలబెట్టాలని చెబుతున్నడు. శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే.. ఇవాళ మీరేం కొత్తగా ఏం చెప్పారు. మీరు చెప్పిందే మొన్న ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో చెప్పారన్నారు.

KTR on Caste Survey Report:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)