Tirupati By-Election Row: తిరుపతి ఉప ఎన్నిక రద్దు పిటిషన్ కొట్టివేత, వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని తెలిపిన ఏపీ హైకోర్టు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యాజ్యాలపై విచారణ మే 3వ తేదీకి వాయిదా

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి గత నెల 17న నిర్వహించిన ఉప ఎన్నికను (Tirupati by-election) రద్దుచేసి రీ పోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు (Andhra Pradesh High Court) శుక్రవారం కొట్టేసింది. ఈ వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని పేర్కొంది.

Tirupati By-Election Row: తిరుపతి ఉప ఎన్నిక రద్దు పిటిషన్ కొట్టివేత, వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని తెలిపిన ఏపీ హైకోర్టు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యాజ్యాలపై విచారణ మే 3వ తేదీకి వాయిదా
HIGH COURT OF ANDHRA PRADESH| (Photo-Twitter)

Amaravati, May 1: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి గత నెల 17న నిర్వహించిన ఉప ఎన్నికను (Tirupati by-election) రద్దుచేసి రీ పోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు (Andhra Pradesh High Court) శుక్రవారం కొట్టేసింది. ఈ వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్‌ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.

ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యంపై అధికరణ 329 కింద నిషేధం ఉందని తెలిపింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని పిటిషనర్లు భావిస్తే అందుకు వారు చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. కాగా తిరుపతి ఉప ఎన్నికలో అక్రమాలు జరిగాయని, అందువల్ల ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ రత్న ప్రభ, పనబాక లక్ష్మి ఈ పిటిషన్లు దాఖలు చేశారు. రేపు తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ అనంతరం ఫలితం వెలువడనుంది.

ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు మే 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల తేదీకి 4 వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలు చేయకపోవడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమంటూ.. ఎన్నికల ప్రక్రియను ఆపేస్తూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసింది.

విద్యార్ధుల జీవితాలతో ఆటలొద్దు, పాస్‌ అని ఇస్తే విద్యార్థులే నష్టపోతారు, అన్ని జాగ్రత్తలతో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తాం, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్

విచారణ జరిపిన ధర్మాసనం ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సింగిల్‌ జడ్జిని కోరింది. శుక్రవారం ఈ పిటిషన్లు విచారణకు రాగా న్యాయమూర్తి సోమవారం విచారణ జరుపుతామని తెలిపారు.

(The above story first appeared on LatestLY on May 01, 2021 12:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).