Andhra Pradesh: ఏపీ ఎస్ఈసీకి మళ్లీ ఎదురుదెబ్బ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మీడియాతో మాట్లాడేందుకు అనుమతించిన హైకోర్టు, కమిషనర్‌ను టార్గెట్ చేసి మాట్లాడొద్దని హితవు
ఏపీ ఎస్ఈసీకి మంత్రి హౌస్, అరెస్ట్, మీడియాతో మాట్లాడకూడదనే విషయంలో హైకోర్టులో (AP High Court) మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడేందుకు ఏపీ హైకోర్టు అనుమతించింది.
Amaravati, Feb 10: ఏపీ ఎస్ఈసీకి మంత్రి హౌస్, అరెస్ట్, మీడియాతో మాట్లాడకూడదనే విషయంలో హైకోర్టులో (AP High Court) మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడేందుకు ఏపీ హైకోర్టు అనుమతించింది.
అయితే ఎస్ఈసీ, కమిషనర్‌ను టార్గెట్ చేసి మాట్లాడొద్దని మంత్రికి (Peddireddy Ramachandra Reddy) కోర్టు సూచించింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్గించకూడదని, ఇచ్చిన అండర్ టేకింగ్‌కు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ఎన్నికల షెడ్యూల్ పూర్తయ్యేవరకు కోర్టు నియమాలు పాటించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
కమిషనర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగకూడదని,ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్గించకూడదని, ఇచ్చిన అండర్ టేకింగ్‌కు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ఎన్నికల షెడ్యూల్ పూర్తయ్యేవరకు కోర్టు నియమాలు పాటించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
కాగా ఏపీ ఎస్ఈసీ పెద్దిరెడ్డి మీద ఈ నెల 6న సంచలన ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. మంత్రి పెద్దిరెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని.. ఈ నెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డి ఇంటికే పరిమితం చేయాలని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది.. అలాగే మంత్రికి మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఆదేశించారు.
ఎస్ఈసీ ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంత్రి హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. మీడియాతో మాట్లొడద్దని స్పష్టం చేశారు. మంత్రిని ఇంటికే పరిమితం చేయాలని ఇచ్చిన ఆదేశాల్ని రద్దు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలని మళ్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. మీడియాతో మాట్లాడకుండా నిలువరించడం రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను నిరాకరించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ జరిపిన ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
(The above story first appeared on LatestLY on Feb 10, 2021 12:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

