HC On Pension Distribution: ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం, పెన్సన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు

ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈసీ ఇచ్చిన ఉత్వర్వులను సమర్థించింది.

HC On Pension Distribution: ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం, పెన్సన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు
AP High Court (photo-Wikimedia Commons)

Vjy, April 4: ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈసీ ఇచ్చిన ఉత్వర్వులను సమర్థించింది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని తెలిపింది. కాగా గుంటూరు జిల్లా కుంచనపల్లి గ్రామానికి చెందిన వి.వరలక్ష్మి, మరో ఇద్దరు పింఛనుదారులు హైకోర్టులో పిల్‌ వేశారు. వారి తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌దేశాయ్‌ వాదనలు వినిపించారు.

పింఛన్ల పంపిణీ సజావుగా సాగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తుచేసింది. అనారోగ్యంతో ఇల్లు కదలలేని లబ్ధిదారుల వద్దకే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది వెళ్లి పింఛను అందజేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న మెమో ఇచ్చిందని విచారణలో తెలిపింది. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలు మృతి, కుటుంబాన్ని పరామర్శించేందుకు ఒకేసారి వెళ్లిన టీడీపీ, వైసీపీ నేతలు, వీడియో ఇదిగో..

దేశంలో వాలంటీర్‌ వ్యవస్థ లేని మిగిలిన రాష్ట్రాల్లోనూ పింఛన్ల పంపిణీ జరుగుతోంది కదా.. అక్కడ ప్రజలే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకుంటున్నారని గుర్తు చేసింది. పెన్షన్ల పంపిణీకి ఈసీ తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయంటూ పిల్ కొట్టేసింది ధర్మాసనం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు చెప్పింది.  ఒకటో తేదీ ఇంటికి రాని పెన్సన్, ఇద్దరు వృద్ధులు గుండెపోటుతో మృతి, ఎక్స్ వేదికగా ప్రతిపక్షాలపై వైసీపీ ఫైర్

వాలంటీర్లను పక్కనపెట్టడంతో కార్యాలయాల వద్దకొచ్చి పింఛను అందుకోవడానికి వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారన్న పిటిషనర్‌ వాదనను తోసిపుచ్చింది. దేశంలో వాలంటీర్‌ వ్యవస్థ లేని మిగిలిన రాష్ట్రాల్లోనూ పింఛన్ల పంపిణీ జరుగుతోంది కదా.. అక్కడ ప్రజలే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకుంటున్నారు కదా అని గుర్తుచేసింది. సజావుగా పెన్షన్ల పంపిణీకి ఈసీ తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

వాలంటీర్లపై అందిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని.. ఈసీ వారిని పక్కనపెట్టిందని గుర్తుచేసింది. వాలంటీర్లను దూరం పెట్టడంతో తమకు పింఛన్‌ అందడం లేదంటూ కొందరు మహిళలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సైతం ధర్మాసనం కొట్టేసింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంప్రదించకుండా ఈసీ ఏకపక్షంగా పింఛను పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ ఉత్తర్వులిచ్చిందన్నారు. రాజకీయ ప్రేరేపిత కారణాలతో సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఈసీకి ఫిర్యాదు చేసిందన్నారు. దీంతో ధర్మాసనం.. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యవహారానికే వాదనలు పరిమితం కావాలని స్పష్టం చేస్తూ పిల్‌ను కొట్టేసింది.

(The above story first appeared on LatestLY on Apr 04, 2024 12:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).