కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ అందలేదన్న బాధతో ఓ వృద్ధుడు గుండె ఆగి మరణించాడు. కూలీ పని చేసుకునే వెంకట్రావ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట్రావ్ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. అంతేకాదు.. వెంకట్రావ్ మృతి చెందిన విషయాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
వెంకట్రావ్ మృతిపై చలించిపోయిన సీఎం జగన్.. వెంకట్రావ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే తిరుపతి జిల్లా వెంకటగిరిలో వెంకటయ్య అనే మరో వృద్ధుడు మృతి చెందాడు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్‌ను ఇవ్వరన్న మనస్తాపంతో గుండెపోటుతో అక్కడికక్కడే వెంకటయ్య కుప్పకూలిపోయాడు. ఈ అంశంపై వైసీపీ పార్టీ ఎక్స్ వేదికగా ప్రతిపక్షాలపై విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టింది. పెన్సన్ ఇంటికి రాదేమోననే భయంతో ఇద్దరు గుండెపోటుతో మృతి, పెన్సన్ల పంపిణీపై మార్గదర్శకాలు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం
Here's YSRCP Tweet
చంద్రబాబు రాజకీయ దాహానికి బలైన పెన్షన్ లబ్ధిదారుడు వెంకట్రావు గారికి అశ్రునివాళి! 🙏🏻
నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు!
పెన్షన్ కోసం సచివాలయానికి వెళ్తూ కాకినాడ రూరల్‌లో 70 ఏళ్ల వెంకట్రావు మృతి
ఒకటో తారీఖున ఠంచనుగా వచ్చే పెన్షన్ రాకపోవడంతో నిన్నటి నుంచి సతమతం.… pic.twitter.com/tZefmZFV3l
— YSR Congress Party (@YSRCParty) April 2, 2024
p
చంద్రబాబు స్వార్థ రాజకీయాలకి బలైపోయిన వెంకటయ్య గారికి అశ్రునివాళి! 😢🙏🏻
తిరుపతి జిల్లా వెంకటగిరిలో వాలంటీర్ పెన్షన్ ఇవ్వలేదని నిన్నటి నుంచి వెంకటయ్య మనస్థాపం
ఈరోజు గుండెపోటుతో మృతి
ఇంకెంత మందిని బలిచేస్తావ్ @ncbn?#TDPAgainstVolunteers#MosagaduBabu#EndOfTDP pic.twitter.com/uDCN2vx4rs
— YSR Congress Party (@YSRCParty) April 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)