ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. కోర్టు షరతుల ప్రకారం.. మిధున్ రెడ్డి వారానికి రెండు సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందుకు హాజరు కావాలి. అదనంగా, రూ.2 లక్షల బెయిల్ బాండ్‌ను సమర్పించాలి. రెండు పూచీకత్తులను కూడా సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో మిధున్ రెడ్డి జూలై 20న అరెస్ట్ చేసింది ఏసీబీ. గత 71 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన మిథున్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం  పలికాయి . గతంలో, ఇదే మద్యం కేసులో ఇతర నిందితులు కూడా బెయిల్ పొందారు. వారిలో నిందితుడు నంబర్ 31 ధనుంజయ రెడ్డి, నంబర్ 32 కృష్ణమోహన్ రెడ్డి, నంబర్ 33 బాలాజీ గోవిందప్ప ఉన్నారు.

షాకింగ్ వీడియో ఇదిగో, వేడి పాలగిన్నెలో పడిన చిన్నారి మృతి, అనంతపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన

VIjayawada ACB Court Grants Bail to YSRCP MP Midhun Reddy

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)