Kotamreddy Phone Tapping Row: అది ట్యాపింగ్ కాదు రికార్డింగ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్‌పై స్పష్టతనిచ్చిన స్నేహితుడు రామశివారెడ్డి, నా ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ వార్తలపై ఆయన స్నేహితుడు రామశివారెడ్డి మీడియాకు స్పష్టత నిచ్చారు. ఆ ఆరోపణలపై మీడియా సమావేశంలో శివారెడ్డి మాట్లాడుతూ..నాది ఆండ్రాయిడ్‌ ఫోన్‌. నా ఫోన్‌ లో ప్రతీకాల్‌ రికార్డవుతుంది. కోటంరెడ్డి చెప్పింది ట్యాపింగ్‌ కాదు.. రికార్డింగ్‌ మాత్రమే. కేవలం యాదృచ్చికంగా కాల్‌ రికార్డయింది’’ అని చెప్పారు.

Rama Siva reddy (Photo-Video Grab)

‘‘ఉద్ధేశపూర్వకంగా రికార్డ్‌ చేసిన కాల్‌ కాదు. ట్యాపింగ్‌ అంటూ ఇంత వివాదం అవుతుందని ఊహించలేదు. ట్యాపింగ్‌ అంటూ కోటంరెడ్డి ఇంత హంగామా చేసినందుకే వాస్తవాలు చెబుతున్నా.. నా ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని రామశివారెడ్డి తేల్చి చెప్పారు. నేను ఎవరో సీఎం జగన్‌కు తెలీదు. ఏదో ఊహించుకుని దుష్ప్రచారం చేస్తున్నారు.

జగన్‌ను ప్రాణం కన్నా ఎక్కువగా ఆరాధించాను, నన్ను అనుమానించడం వల్లే పార్టీకి దూరమవుతున్నా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మా ఇద్దరివీ ఐఫోన్‌లు అని కోటంరెడ్డి అబద్ధం చెప్పారు. నాపై ఎవరి ఒత్తిడీ లేదు.. వాస్తవం చెప్పేందుకే మీడియా ముందుకొచ్చా’’ అని రామశివారెడ్డి స్పష్టం చేశారు. తనకు 30 ఏళ్లుగా వైఎస్‌ కుటుంబంతో అనుబంధం ఉందన్నారు. వైఎస్‌ కుటుంబంపై విశ్వాసం ఉందని ఆయన అన్నారు.

(The above story first appeared on LatestLY on Feb 08, 2023 04:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).