AP Shocker: ఇదేమి గొంతు కోయడాలు బాబోయ్, ఏపీలో యువతి గొంతు కోసిన ఉన్మాది, మేనమామే సూత్రధారి, అనకాపల్లిలో దారుణ ఘటన వెలుగులోకి..
ఏపీలో అనకాపల్లి జిల్లాలో ఓ ఉన్మాది యువతి గొంతుకోసి (Man slits throat girl) తీవ్రంగా గాయపరిచాడు. జిల్లాలోని వి.మాడుగులో ఈ ఘటన చోటు చేసుకుంది. నగేశ్ అనే యువకుడు బ్లేడ్‌తో యువతి గొంతుకోసి పరారయ్యాడు . దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి.
Amaravati, April 25: ఏపీలో అనకాపల్లి జిల్లాలో ఓ ఉన్మాది యువతి గొంతుకోసి (Man slits throat girl) తీవ్రంగా గాయపరిచాడు. జిల్లాలోని వి.మాడుగులో ఈ ఘటన చోటు చేసుకుంది. నగేశ్ అనే యువకుడు బ్లేడ్‌తో యువతి గొంతుకోసి పరారయ్యాడు . దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి.
అనకాపల్లి జిల్లాలోని జి. మాడుగుల మండలంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద Swathi అనే యువతి గొంతు కోశాడు Nagesh అనే యువకుడు. యువతి బంధువులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. గతంలో రెండు సార్లు యువతినిపై నిందితుడు బెదిరించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన కూతురిపై యువకుడి దాడి వెనుక తన సోదరుడి ప్రమేయం ఉందని బాధితురాలి తల్లి ఆరోపిస్తుంది.
యువతి మేనమామ Konda Babu ఈ దాడికి సూత్రధారి అని బాధితురాలి తల్లి ఆరోపణలు చేస్తుంది. స్వాతి తల్లికి వారసత్వంగా వచ్చే ఆస్తి విషయమై సోదరుడు కొండబాబుతో ఉన్న విబేధాల కారణంగా ఈ దాడికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్వాతిని హత్య చేస్తే నగేష్ కు లక్ష రూపాయాలు ఇస్తానని ఒప్పందం చేసుకొన్నాడని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. గతంలో కూడా తమ కూతురిపై దాడి జరిగిన సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా స్వాతి తల్లి చెబుతుంది. స్వాతిపై దాడి చేసిన తర్వాత నగేష్ పారిపోయాడు. నగేష్ తో పాటు కొండబాబు కూడా పారిపోయినట్టుగా సమాచారం. బాధిత కుటుంబం పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు నగేష్, కొండబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇక అనకాపల్లి జిల్లాలోని రావికమతంలో కాబోయే భర్త రామునాయుడు గొంతు కోసింది యువతి పుష్ప. ఈ ఘటన ఈ నెల 18న చోటు చేసుకొంది. పాడేరుకు చెందిన రాము నాయుడికి రావికమతం గ్రామానికి చెందిన పుష్పకు మే మాసంలో వివాహం జరిపించాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయం తీసుకొన్నారు.ఈ నెల 4 వ తేదీన నిశ్చితార్ధం కూడా చేశారు. అయితే ఈ వివాహం ఇష్టం లేదని పేరేంట్స్ కు పుష్ప చెప్పలేదు. పెళ్లిని తప్పించుకొనేందుకు కాబోయే భర్తను చంపాలని ప్లాన్ చేసింది.హైద్రాబాద్ లో ఉద్యోగం చేసే రాము నాయుడు ఈ నెల 15న హైద్రాబాద్ నుండి స్వగ్రామం వచ్చాడు. కాబోయే భార్యతో ఆయన ఫోన్ లో మాట్లాడాడు. ఈ నెల 18 యువతి ఇంటికి వచ్చాడు. తన స్నేహితులకు పరిచయం చేయిస్తానని యువతి రామునాయుడిని సమీపంలోని ఆలయం వద్దకు తీసుకెళ్లింది. మార్గమధ్యలో చాకును కొనుగోలు చేసింది. గుడి వద్ద కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత సర్ ప్రైజ్ ఇస్తానని రాము నాయుడి కళ్లకు గంతలు కట్టి గొంతు కోసింది పుష్ప.
తనకు పెళ్లి ఇష్టం లేదని దైవ భక్తితోనే జీవితం గడుపుతానని పుష్ప పోలీసుల విచారణలో చెప్పింది.ఈ విషయాన్ని పేరేంట్స్ కు చెప్పినా కూడా వినకుండా పెళ్లిని నిశ్చయించారని ఆమె పోలీసులకు చెప్పింది. గతంలో కూడా రెండు సంబంధాలు తప్పిపోవడంతో రాము నాయుడితో తమ కూతురి వివాహం జరిపించాలని పేరేంట్స్ ఆశ పడ్డారు. కానీ పుష్ప రాము నాయుడి గొంతు కోయడంతో పుష్పను పోలీసులు అరెస్ట్ చేశారు.
(The above story first appeared on LatestLY on Apr 25, 2022 05:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

