Telangana Shocker: హన్మకొండలో మరో పుష్ప, భర్త నిద్రిస్తుండగా బ్లేడుతో గొంతు కోసిన భార్య, వరంగల్‌లో పెళ్లైన నెలకే దారుణ ఘటన
Image used for representational purpose only | (Photo Credits: PTI)

Hyd, April 25: ఇటీవల భర్తలపై భార్యల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన ‘పుష్ఫ’ ఘటన మరవకముందే తెలంగాణలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహమై నెల రోజులైనా కాకముందే దారుణం జరిగింది. హన్మకొండ జిల్లాలోని దామెర మండలం పసరగొండ గ్రామంలో భార్య అర్చన.. భర్త రాజు గొంతు కోసింది. అయితే, వీరికి మార్చి 25వ తేదీన వివాహం జరగడం విశేషం.

ఇటీవల కుటుంబ కలహాలతో భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. ఈ క్ర‌మంలో సోమ‌వారం తెల్ల‌వారుజామున గాఢ నిద్ర‌లో ఉన్న రాము మెడ‌పై లావ‌ణ్య బ్లేడ్‌తో దాడి చేసింది. రాజుకు తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో కుటుంబ స‌భ్యులు అత‌న్ని ఎంజీఎం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. రాజు ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇదిలా ఉండగా.. పెళ్లి అయినప్పటి నుంచి అర్చన విచిత్రంగా ప్రవర్తిసోందని కుటుంబ సభ్యులు తెలిపారు.

నాతో సెక్స్ చేయాలని వదినపై మరిది బలవంతం, ఛీ కొట్టడంతో ఆమె భర్తను చంపేసిన కసాయి, యూపీలో దారుణ ఘటన వెలుగులోకి..

మరోవైపు.. ఇటీవలే విశాఖపట‍్నంలో పుష్ప అనే యువతి.. సర్‌ప్రైజ్‌ అంటూ తనకు కాబోయే భర్తను కళ్లుమూసుకోమని కత్తితో గొంతుకోసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.