Andhra Pradesh: తాగిన మత్తులో భార్య బుగ్గను రక్తం వచ్చేలా కొరికిన భర్త, లబోదిబో మంటూ పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన భార్య, కేసు నమోదు చేయాలని వినతి

ఏపీలో ఆసక్తికరఘటన చోటు చేసుకుంది. ఓ భర్త మద్యం మత్తులో తన భార్య బుగ్గను కొరికాడు. దీంతో భార్య కెవ్వున అరించింది. వెంటనే నా భర్త నా బుగ్గ కొరికాడంటూ పోలీసులను (Man booked for biting wife's cheek) ఆశ్రయించింది.

Andhra Pradesh: తాగిన మత్తులో భార్య బుగ్గను రక్తం వచ్చేలా కొరికిన భర్త, లబోదిబో మంటూ పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన భార్య, కేసు నమోదు చేయాలని వినతి
Representational Image | (Photo Credits: IANS)

Krishna, August 11: ఏపీలో ఆసక్తికరఘటన చోటు చేసుకుంది. ఓ భర్త మద్యం మత్తులో తన భార్య బుగ్గను కొరికాడు. దీంతో భార్య కెవ్వున అరించింది. వెంటనే నా భర్త నా బుగ్గ కొరికాడంటూ పోలీసులను (Man booked for biting wife's cheek) ఆశ్రయించింది. ఈ విచిత్ర‌మైన ఘ‌ట‌న కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు ప‌రిధిలోని కానూరు కేసీపీ కాల‌నీలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసీపీ కాల‌నీకి చెందిన స్ర‌వంతి, రాంబాబు భార్యాభ‌ర్త‌లు. రాంబాబు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తుండ‌గా, భార్య ఇంటి ద‌గ్గ‌రే ఉంటుంది. రాంబాబు మ‌ద్యానికి బానిస అయ్యాడు. ప్ర‌తి రోజు పీక‌ల దాకా మ‌ద్యం సేవించి, భార్య‌ను మాన‌సికంగా, శారీర‌కంగా హింసిస్తున్నాడు. మంగ‌ళ‌వారం రాత్రి కూడా మ‌ద్యం సేవించి ఇంటికొచ్చాడు. అనంతరం మ‌ద్యం మ‌త్తులో భార్య బుగ్గ (biting wife's cheek) కొరికాడు.

క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి

దీంతో ఆమె కేక‌లు వేసింది. చెంప‌కు తీవ్ర గాయం కావ‌డంతో ఆమెను స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. త‌న భ‌ర్త బుగ్గ కొరికాడ‌ని, కేసు న‌మోదు చేయాలంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఆవిడ ఫిర్యాదును చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. ఎంతకీ వినకపోవడంతో కేసు నమోదు చేయక తప్పలేదు.

(The above story first appeared on LatestLY on Aug 11, 2022 12:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).