 
                                                                 Vizianagaram, Feb 18: విజయనగరం జిల్లాలోని కొత్తపేట పరిధిలోని శాలువపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిన్నా అనే యువకుడు రెండు సంత్సరాల నాలుగునెలల పాపపై పైశాచికత్వం (Man held for torturing two-year baby ) ప్రదర్శించాడు. బుగ్గలు, తొడల భాగంలో గోళ్లతో రక్కేశాడు. చిన్నారి ఏడుస్తున్నా విడిచిపెట్టకుండా పైశాచిక అనందం పొందాడు. నెల వ్యవధిలో ఇలా అనేక సార్లు ఆ పసిపాపపై ఇలా దారుణంగా ప్రవర్తించాడు. దిశ పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు.
దిశ డీఎస్పీ టి.త్రినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. భర్తను వదిలేసి చంటి బిడ్డతో ఉన్న మహిళతో నెల్లిమర్లలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న త్రినాథ్ (చిన్న)కు ఏడు నెలల కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి (extramarital affair in Vizianagaram) దారితీసింది. ఆ మహిళతో కలిసి కొత్తపేట సాలివీధిలో ఓ అద్దె ఇంటిలో కాపురం పెట్టాడు. బుధవారం రాత్రి చిన్నారిని త్రినాథ్‌వద్ద విడిచిపెట్టి ఆమె ఓ శుభకార్యానికి వెళ్లింది.
ఆ సమయంలో చిన్నారి శరీరంపై గోళ్లతో రక్కి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఇంటికి వచ్చిన తల్లి బిడ్డను చూసి నివ్వెర పోయింది. దిశ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటికే పరారైన నిందితుడిని గాలించి పట్టుకున్నారు. చిన్నారిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
