Tenali Car Accident: మైనర్ల అత్యుత్సాహం ముగ్గురుని ఆస్పత్రి పాలు చేసింది. తెనాలిలో కారు బీభత్సం, రోడ్డు పక్కన రిక్షాలు మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లిన కారు

గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో ఓ కారు భీబత్సం (Tenali Car Accident) సృష్టించింది. టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ రోడ్డు పక్కన రిక్షాలు మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరి కాలు నుజ్జు నుజ్జు అవగా... మరో ఇద్దరికి తీవ్ర ( three critically injured) గాయాలయ్యాయి.

Tenali Car Accident: మైనర్ల అత్యుత్సాహం ముగ్గురుని ఆస్పత్రి పాలు చేసింది. తెనాలిలో కారు బీభత్సం, రోడ్డు పక్కన రిక్షాలు మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లిన కారు
Tenali Car Accident (Photo-Video Grab)

Guntur, July 6: గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో ఓ కారు భీబత్సం (Tenali Car Accident) సృష్టించింది. టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ రోడ్డు పక్కన రిక్షాలు మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరి కాలు నుజ్జు నుజ్జు అవగా... మరో ఇద్దరికి తీవ్ర ( three critically injured) గాయాలయ్యాయి. కారు కింద పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇద్దరు మైనర్లు కారు నడుపుతున్నట్లు గుర్తించారు.

అతివేగం కారణంగా కారు అదుపుతప్పి ఇంతటి బీభత్సాన్ని (Minors crash car onto people in Tenali) సృష్టించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెనాలిలోని ఐతానగర్‌కు చెందిన ఇద్దరు మైనర్లు కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు.వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

నిరుద్యోగులకు మంచి అవకాశం, వచ్చే నెలలో మొత్తం 212 పోస్టులకు గ్రూప్ నోటిఫికేషన్, గ్రూప్ 1 నుంచి 110 పోస్టులు, గ్రూప్ 2 నుంచి 102 పోస్టులకు రిక్రూట్‌ మెంట్

తెలంగాణ నారాయ‌ణ‌పేట లోని కోస్గి మండ‌లం గుండుమాల్ వ‌ద్ద మంగ‌ళ‌వారం రాత్రి ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఆర్టీసీ బ‌స్సు – బైక్ ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై ప్ర‌యాణిస్తున్న ముగ్గురు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను వెంక‌టేశ్‌(25), బ్ర‌హ్మం(25), శ్రీను(25)గా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

(The above story first appeared on LatestLY on Jul 06, 2022 06:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).