Andhra Pradesh: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త, జీతాలను 37 శాతం పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త, జీతాలను 37 శాతం పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
YS jagan Mohan Reddy (Photo-AP CMO)

ఏపీ ప్రభుత్వం విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. ఏపీలో విద్యుత్‌ శాఖ ఔట్‌సోర్సింగ్‌ ఉ‍ద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యుత్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 27వేల మంది విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త, ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయనున్న జగన్ సర్కారు, కొద్దిరోజుల్లో ఉత్తర్వులు జారీ

కాగా, సీఎం జగన్‌ సూచనలతో విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు ఆయన తెలిపారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది. అలాగే, గ్రూప్‌ ఇన్యూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించింది.

(The above story first appeared on LatestLY on Aug 16, 2023 06:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).