Corona in Andhra Pradesh: చిత్తూరులో మళ్లీ పెరిగిన కేసులు, రాష్ట్రంలో కొత్తగా 1,507 మందికి కరోనా పాజిటివ్‌, 24 గంటల్లో 18 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 15,179 యాక్టివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 64,550 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,507 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు.

Corona in Andhra Pradesh: చిత్తూరులో మళ్లీ పెరిగిన కేసులు, రాష్ట్రంలో కొత్తగా 1,507 మందికి కరోనా పాజిటివ్‌, 24 గంటల్లో 18 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 15,179 యాక్టివ్ కేసులు
Coronavirus | Representational Image (Photo Credits: ANI)

Amaravati, August 25: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 64,550 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,507 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,825 కు చేరింది. గత 24 గంటల్లో 1,213 మంది (1201 recoveries) కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,80,224 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం15,179 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,09,228 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,65,35,822 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 255 కేసులు నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో 232 కేసులు నమోదయ్యాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 212 కేసులు నమోదు కాగా నెల్లూరు జిల్లాలో 217 కేసులు నమోదయ్యాయి.

థర్డ్ వేవ్ అలర్ట్, కరోనా గైడ్‌లైన్స్ సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు పొడిగింపు, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర హోంశాఖ

కోవిడ్ తో గత 14 గంటల్లో కృష్ణాలో నలుగరు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, విశాఖలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒకరు మరణించారు.

గత 24 గంటల్లో కేసులు వివరాలు

అనంతపూర్ - 35

చిత్తూరు - 255

తూర్పుగోదావరి - 232

గుంటూరు - 127

కడప - 92

కృష్ణా - 159

కర్నూలు - 4

నెల్లూరు - 164

ప్రకాశం - 112

శ్రీకాకుళం - 34

విశాఖపట్నం - 83

విజయనగరం - 48

పశ్చిమగోదావరి - 212

(The above story first appeared on LatestLY on Aug 29, 2021 05:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).