AP Covid Report: ఏపీలో కరోనా కేసులపై భారీ ఊరట, తాజాగా 24,819 మంది కోలుకుని డిశ్చార్జ్, కొత్తగా 23,160 మందికి కోవిడ్ పాజిటివ్, 24 గంటల్లో 106 మంది మృతి

ఏపీలో గడచిన 24 గంటల్లో 1,01,330 కరోనా పరీక్షలు నిర్వహించగా 23,160 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.అదే సమయంలో 24,819 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా.. ఏపీలో ఇప్పటివరకు 14,98,532 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 12,79,110 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఇంకా 2,09,736 మంది చికిత్స పొందుతున్నారు.

AP Covid Report: ఏపీలో కరోనా కేసులపై భారీ ఊరట, తాజాగా 24,819 మంది కోలుకుని డిశ్చార్జ్, కొత్తగా 23,160 మందికి కోవిడ్ పాజిటివ్, 24 గంటల్లో 106 మంది మృతి
Coronavirus outbreak | (Photo Credits: IANS)

Amaravati, May 19: ఏపీలో గడచిన 24 గంటల్లో 1,01,330 కరోనా పరీక్షలు నిర్వహించగా 23,160 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరిలో అత్యధికంగా 3,528 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 2,670 కేసులు, అనంతపురం జిల్లాలో 2,334 కేసులు, విశాఖ జిల్లాలో 2,007 కేసులు గుర్తించారు. ఒక్క విజయనగరం జిల్లా (945) మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ 1000కి పైన పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.

తాజాగా 106 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 17 మంది కరోనాకు బలయ్యారు. నెల్లూరు, విశాఖ జిల్లాల్లో 11 మంది చొప్పున మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 9,686కి చేరింది. అదే సమయంలో 24,819 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా.. ఏపీలో ఇప్పటివరకు 14,98,532 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 12,79,110 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఇంకా 2,09,736 మంది చికిత్స పొందుతున్నారు.

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, బ్లాక్ ఫంగస్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు, వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం

కరోనా బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు బుధవారం ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు. కరోనాతో కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరుపై ప్రభుత్వం రూ.10 లక్షల డిపాజిట్‌ చేయనుందని తెలిపారు. ఆ మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతినెలా ఇచ్చేలా లబ్దిదారులకు అందించేలా కార్యాచరణ రూపొం‍దించినట్లు సింఘాల్‌ తెలిపారు.

Here's AP Covid Report

ప్రభుత్వాస్పత్రుల్లో 21,493 రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్‌ రోజువారి గరిష్ట వినియోగం 650 మెట్రిక్‌ టన్నులు కాగా అందుబాటులో 635 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు చెప్పారు. ఆక్సిజన్‌ రవాణా కోసం 78 ట్యాంకర్లు, 14 చిన్న ట్యాంకర్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 4+2 ఐఎస్‌ఓ ట్యాంకర్లు కలిగిన 2 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి ట్యాంకర్‌కు 20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సామర్థ్యం ఉంటుందని తెలిపారు.

సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ మిషన్లను ప్రాంభించిన ఏపీ సీఎం, ప్రభుత్వాస్పత్రులను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపిన వైయస్ జగన్

గత 24 గంటల్లో కరోనా బారినపడి మరణించినవారి వివరాలు.. చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున.. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున.. అనంతపురం, గుంటూరు, విశాఖ, ప.గో.జిల్లాల్లో 8 మంది చొప్పున.. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున.. నెల్లూరు జిల్లాలో ఐదుగురు.. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు.. శ్రీకాకుళం- 1466, విజయనగరం- 965, విశాఖ- 2368 కేసులు, తూ.గో- 2923, ప.గో- 1762, కృష్ణా- 1048, గుంటూరు- 1291 కేసులు, ప్రకాశం- 785, నెల్లూరు- 1251, చిత్తూరు- 2630 కేసులు, అనంతపురం- 2804, కర్నూలు- 991, వైఎస్ఆర్ జిల్లా- 1036 కేసులు నమోదయ్యాయి.

(The above story first appeared on LatestLY on May 19, 2021 08:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).