AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 520 మందికి కొవిడ్ పాజిటివ్, మరో 519 మంది రికవరీ, రాష్ట్రంలో5,236గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా చిత్తూరు నుంచి 108, కృష్ణా జిల్లా నుంచి 71, గుంటూరు నుంచి 64, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల నుంచి వరుసగా 69, 59 కొత్త కేసులు నమోదయ్యాయి....

AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 520 మందికి కొవిడ్ పాజిటివ్, మరో 519 మంది రికవరీ, రాష్ట్రంలో5,236గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Coronavirus in AP (Photo Credits: PTI)

Amaravati, December 11: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ ఉధృతి చాలా వరకు తగ్గింది. ఇటీవల కాలంగా కొవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు తక్కువగానే నమోదవుతున్నాయి. అయితే గత రెండు, మూడు రోజులుగా కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసులతో దాదాపు సరిసమానంగా డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య ఉండటంతో ఆక్టివ్ కేసుల సంఖ్యలో పెద్ద మార్పు ఏమి కనిపించడం లేదు.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  64,425 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 520 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య  8,74,515కు చేరింది.  వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,71,610గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా చిత్తూరు నుంచి 108,  కృష్ణా జిల్లా నుంచి 71,  గుంటూరు నుంచి 64, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల నుంచి వరుసగా 69, 59   కొత్త కేసులు నమోదయ్యాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో మరో 2 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7049కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 519 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 8,62,230 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 5,236 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Dec 11, 2020 06:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).