AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9,999 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5 లక్షల 47 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 4779కి పెరిగిన కరోనా మరణాలు

తూర్పు గోదావరి జిల్లాలో కరోనావైరస్ వ్యాప్తిలో ఎలాంటి నియంత్రణ కనిపించడం లేదు. గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే....

AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9,999 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5 లక్షల 47 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 4779కి పెరిగిన కరోనా మరణాలు
Screening for coronavirus | Representational image | (Photo Credits: PTI)

Amaravati, September 11: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభన కొనసాగుతోంది,  ప్రతీరోజు కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యలో  పెద్దగా మార్పేమి కనిపించడం లేదు.  మరోసారి కూడా సుమారు 10 వేల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను గమనిస్తే  ఫ్యాన్సీ నెంబర్ లాగా సరిగ్గా 9,999 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 5,47,686కు చేరింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 5,44,791 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఇటు తూర్పు గోదావరి జిల్లాలో  కరోనావైరస్ వ్యాప్తిలో ఎలాంటి నియంత్రణ కనిపించడం లేదు.  గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే అత్యధికంగా 1499 కేసులు నమోదయ్యాయి.

అలాగే పశ్చిమ గోదావరి మరియు చిత్తూరు జిల్లాల నుంచి కూడా వెయ్యికి పైబడి పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో  మరో 77 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 4,779 కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 11,069 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 4,46,716 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 96,191 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  71,137 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు రాష్ట్రంలో  44,52,128 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

(The above story first appeared on LatestLY on Sep 11, 2020 06:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).