COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తున్న రెండో దశ కోవిడ్, కొత్తగా 2,765 కోవిడ్ కేసులు నమోదు.. 11 మంది మృతి, నెల రోజుల్లో అర్హులైన కోటి మందికి టీకా పంపిణీ చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ అంతకంతకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం మరియు నెల్లూరు జిల్లాల్లో కోవిడ్ విజృంభిస్తుంది. ఈ నాలుగైదు జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి....
Amaravathi, April 9: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ అంతకంతకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం మరియు నెల్లూరు జిల్లాల్లో కోవిడ్ విజృంభిస్తుంది. ఈ నాలుగైదు జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి.
ప్రధానితో సీఎంల భేటీలో పాల్గొన్న అనంతరం సీఎం జగన్ రాష్ట్రంలో కోవిడ్ కట్టడి మరియు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు 'టీకా ఉత్సవ్' కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 11 నుంచి 14 వరకు సుమారు 24 లక్షల టీకాల పంపిణీ చేయటానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. అంతేకాకుండా 45 ఏళ్లు పైబడిన వారికి నెల రోజుల్లో సుమారు 1 కోటి మంది లక్ష్యంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ఇక, రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,892 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 2,765 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 9,18,597 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 9,15,702గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 496 కోవిడ్ కేసులు నమోదు కాగా, గుంటూరు నుంచి నుంచి 490 కేసులు, విశాఖపట్నం నుంచి 335, మరియు నెల్లూరు నుంచి 292 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 11 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7,279కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,245 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,94,896 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 16,422 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Apr 09, 2021 06:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

