 
                                                                 Amaravati, JUne 17: కృష్ణా జిల్లా (krishna district) జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Vedadri Road Accident) జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గోపవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం గోపవరం నుంచి 25 మందితో ట్రాక్టర్‌లో దైవదర్శ నానికి వేదాద్రి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం ( Krishna Road Accident) జరిగింది. సరిహద్దుల్లో నెత్తుటి ధారలపై స్పందించిన అమెరికా, అక్కడ అసలేం జరుగుతోంది, 20 మంది భారత జవాన్లు మృతి వెనుక చైనా చిమ్మిన విషం ఏమిటీ?
ఎర్రుపాలెం గోపవరం గ్రామానికి చెందిన వారు దాదాపు 25 మంది ట్రాక్టర్‌లో వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి దైవదర్శనానికి వెళ్తుండగా, జగ్గయ్యపేట శివారులో వేగంగా ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
