Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, చిన్న గొడవకే డ్రైవర్‌ని బస్సుతో తొక్కించి చంపిన మరో డ్రైవర్, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన యాక్సిడెంట్ వీడియో
చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మహా సముద్రం టోల్‌గేట్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్‌ని.. మరో బస్సు డ్రైవర్ బస్సుతో తొక్కించి హతమార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్నింగ్ స్టార్, శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సుల డ్రైవర్లు వాగ్వాదం హద్దు మీరి ఈ హత్యకు కారణమైంది
Vjy. July 24: చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మహా సముద్రం టోల్‌గేట్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్‌ని.. మరో బస్సు డ్రైవర్ బస్సుతో తొక్కించి హతమార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్నింగ్ స్టార్, శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సుల డ్రైవర్లు వాగ్వాదం హద్దు మీరి ఈ హత్యకు కారణమైంది. ప్రాణాలు కోల్పోయిన సుధాకర్ రాజుది గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెం కాగా నిందితుడు డ్రైవర్ శ్రీనివాసరావు విజయవాడ అయ్యప్పనగర్ యనమలకుదురు రోడ్డులో నివాసం ఉంటున్నాడు. దారుణం, సుత్తితో సూపర్‌వైజర్ తలపై మోది దారుణ హత్య, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఘటన వివరాల్లోకి వెళితే.. ఓ బస్సు అద్దం మరో బస్సుకు తగలడంతో.. రెండు బస్సుల డ్రైవర్లు బస్సుల్ని ఆపి ఘర్షణపడ్డారు. ఘర్షణ అనంతరం శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు టోల్ గేట్ దగ్గర నుంచి ముందుకు కదిలింది.అయితే మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ డ్రైవర్ సుధాకర్ రాజు బస్సు దిగి దానికి అడ్డంగా నిలబడ్డాడు. శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు కోపంతో అతనిపై నుండి బస్సును పోనివ్వడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. కాగా అతన్ని బస్సు సుమారు కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లడంతో మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
Here's Video
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మహదేవ సముద్రం టోల్‌గేట్ వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ డ్రైవర్ మరో డ్రైవర్‌ని బస్సు తొక్కించి చంపాడు. సుమారు కిలోమీటర్ దూరం వెళ్లడంతో మృతదేహం గుర్తు పట్టని స్థితిలో ఉంది. #spynewslive pic.twitter.com/Y1vJ9UAswf
— Spy News Live (@SpyNewslive) July 24, 2024
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మహదేవ సముద్రం టోల్‌గేట్ వద్ద దారుణం చోటు చేసుకుంది.
ఓ డ్రైవర్ మరో డ్రైవర్‌ని బస్సు తొక్కించి చంపాడు. సుమారు కిలోమీటర్ దూరం వెళ్లడంతో మృతదేహం గుర్తు పట్టని స్థితిలో ఉంది. pic.twitter.com/YRNcfvzBX1
— ChotaNews (@ChotaNewsTelugu) July 24, 2024
మహాసముద్రం టోల్‌గేటు దగ్గరున్న సీసీ కెమెరాలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు సుధాకర్‌రాజు తొక్కించుకుంటూ వెళ్లడం రికార్డైంది. టోల్‌గేట్ దగ్గర సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న బంగారుపాళ్యం పోలీసులు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. అతడిపై 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేశారు.శ్రీకృష్ణ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కూడా బంగారుపాళ్యం పోలీసులు పిలిచి ప్రశ్నిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jul 24, 2024 07:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

