హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని సుత్తితో తలపై మోది హత్య చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజి ప్రాంతానికి చెందిన రాజేష్ కుమార్ ( 44) నగరానికి వలసవచ్చి పెయింటింగ్ కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద జిమ్ ఓనర్‌ని 21 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రత్యర్థి
గతరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతను ఉంటున్న గదిలోకి ప్రవేశించి రాజేష్ కుమార్ తలపై సుత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యా కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Here's Video
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వ్యక్తిని సుత్తితో దాడి చేసిన దుండగులు
మృత్యుడు ఉత్తరప్రదేశ్ కి చెందిన రాజేష్ కుమార్ గా గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు pic.twitter.com/pybpi8Uy4z
— ChotaNews (@ChotaNewsTelugu) July 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)