Andhra Pradesh Shocker: ఆరేళ్ల బాలికపై 45 ఏళ్ళ కామాంధుడు లైంగికదాడి, బట్టలూడదీసి మర్మాంగాన్ని చితక్కొట్టిన స్థానికులు, అనంతరం పోలీసులకు అప్పగింత, కుప్పంలో ఘటన

కుప్పంలో దారుణం చోటు చేసుకున్నది. ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి (Andhra Pradesh Shocker) పాల్పడ్డాడు. దారుణాన్ని గుర్తించిన స్థానికులు అతగాడ్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మర్మాంగంపై తీవ్రంగా గాయాలు కావడంతో పోలీసులు అతడ్ని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Andhra Pradesh Shocker: ఆరేళ్ల బాలికపై 45 ఏళ్ళ కామాంధుడు లైంగికదాడి, బట్టలూడదీసి మర్మాంగాన్ని చితక్కొట్టిన స్థానికులు, అనంతరం పోలీసులకు అప్పగింత, కుప్పంలో ఘటన
Image Used For Representational Purpose Only | (Photo Credits: Newsplate)

Kuppam, June 8: కుప్పంలో దారుణం చోటు చేసుకున్నది. ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి (Andhra Pradesh Shocker) పాల్పడ్డాడు. దారుణాన్ని గుర్తించిన స్థానికులు అతగాడ్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మర్మాంగంపై తీవ్రంగా గాయాలు కావడంతో పోలీసులు అతడ్ని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కుప్పం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్పం పట్టణానికి చెందిన 45 సంవత్సరాల శ్రీధర్‌ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటున్న ఆరేండ్ల చిన్నారిని మాటలతో మభ్యపెట్టి సమీపంలో ఉన్న పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి ( Man held for raping six-year-old) యత్నించాడు. యూపీలో దారుణం, తల్లిని తుఫాకీతో కాల్చి రెండు రోజులు శవాన్ని ఇంట్లో దాచిపెట్టిన మైనర్ బాలుడు, ఎవరికైనా చెబితే చంపేస్తానని చెల్లెలికి బెదిరింపులు, మైనర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇది గమనించిన స్థానికులు బాలికను రక్షించి తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికు తరలించారు. అనంతరం చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి శ్రీధర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఒంటిపై బట్టలు విప్పేసి చితకబాదారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు శ్రీధర్‌ మర్మాంగంపై తీవ్రంగా గాయాలు కావడంతో పోలీసులు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికపై లైంగికదాడికిపాల్పడిన శ్రీధర్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

(The above story first appeared on LatestLY on Jun 08, 2022 08:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).