Andhra Pradesh Shocker: పెళ్లన్నాడు.. రెండేళ్ల నుంచి కామవాంఛలు తీర్చుకున్నాడు. ఇప్పుడు కాదు పొమ్మన్నాడు, విశాఖలో పోలీసులను ఆశ్రయించిన మైనర్ బాలిక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఏపీలో విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల మైనర్ బాలికపై ఆమె ఇంటి పక్కనే ఉండే యువకుడు రెండేళ్లుగా అత్యాచారానికి (Neighbour rapes minor girl ) పాల్పడుతూ వచ్చాడు. పెళ్లి పేరుతో( pretext of marriage) రెండేళ్ల నుంచి తన కామవాంఛలను ఆ బాలిక ద్వారా తీర్చుకున్నాడు ఓ కామాంధుడు.
Visakha, June 24: ఏపీలో విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల మైనర్ బాలికపై ఆమె ఇంటి పక్కనే ఉండే యువకుడు రెండేళ్లుగా అత్యాచారానికి (Neighbour rapes minor girl ) పాల్పడుతూ వచ్చాడు. పెళ్లి పేరుతో( pretext of marriage) రెండేళ్ల నుంచి తన కామవాంఛలను ఆ బాలిక ద్వారా తీర్చుకున్నాడు ఓ కామాంధుడు. అనకాపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక కాలేజికి వెళ్లే సమయంలో తన ఇంటికి పక్కనే ఉండే నానాజి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమిస్తున్నానంటూ ఆ బాలిక వెంటపడేస్థాయికి వెళ్లింది. నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ ఆ మైనర్ బాలికను నమ్మించాడు.
ఆ బాలిక అతన్ని నమ్మి తన శీలాన్ని అప్పగించింది. రెండేళ్ళ నుంచి అతను ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ సమయంలో మైనర్ బాలిక తన తండ్రి అల్మారాలో భవిష్యత్ అవసరాల కోసం దాచిన రూ. 12. 5 లక్షలను దాచిపెట్టగా అందులో 11 లక్షల రూపాయలను తన లవర్ కుటుంబానికి ఇచ్చింది. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే ఓ రోజు తండ్రి అల్మారా తెరిచి చూడగా అందులో కేవలం రూ. 82 వేలు మాత్రమే ఉండటంతో ఖంగు తిన్నాడు.
మైనర్ బాలిక తల్లిదండ్రులు పరువు పోతుందని భావించి ఆ యువకుడిని తమ కూతురుని పెళ్ళి చేసుకోవాలని కోరారు. అయితే ఆ యువకుడు అందుకు నిరాకరించాడు. దీంతో భాదితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఆ యువకుడి మీద కేసు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jun 24, 2022 05:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

