AP Shocker: భార్యపై పదే పదే అనుమానం, తట్టుకోలేక రోకలి బండతో తలపై కొట్టి చంపిన భార్య, కృష్ణా జిల్లాలో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
Andhra Pradesh Shocker, Andhra Pradesh, Shocker, AP Shocker, Woman kills husband, Krishna District, భర్తను చంపిన భార్య, కృష్ణా జిల్లా, కుటుంబ గొడవలు, భార్యపై అనుమానం
Krishna, July 31: ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఆముదార్లంక గ్రామంలో భర్తను పచ్చడి దంచే రోకలి బండతో ( Woman kills husband) కొట్టి చంపేసింది. ఈ ఘటనలో భార్యను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఘటనపై చల్లపల్లి సీఐ బి. భీమేశ్వర రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి మండల పరిధిలోని ఆముదార్లంకలో కళ్లేపల్లి వెంకట సుబ్బారావును అతని భార్య వీరకుమారి తనను పదేపదే అనుమానిస్తున్నాడనే (Suspicion) కోపంతో పచ్చడి బండతో తలపై కొట్టి చంపింది.
దంపతులిద్దరి మధ్య చాలా రోజుల నుంచి గొడవలు (Family Issues) జరుగుతూ ఉన్నాయి. ఏడు నెలల కిందట భార్య ఈ గొడవల వల్ల పుట్టింటికి వెళ్లిపోగా పెద్దల రాజీ ప్రయత్నంతో మళ్లీ కాపురానికి వచ్చింది. అయినా భర్త మారకుండా గ్రామస్తులతో సన్నిహితంగా మెలిగినా, ఫోనులో మాట్లాడినా ఆమెను సుబ్బారావు మందలిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే గురువారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఆగ్రహానికి గురైన వీరకుమారి ఇంట్లో ఉన్న పచ్చడిబండతో భర్త కళ్లేపల్లి వెంకట సుబ్బారావు తలపై బలంగా కొట్టింది.
ఈ గాయంతో సుబ్బారావు శుక్రవారం ఉదయాన్నే మృతి చెంది కనిపించాడు. మృతుని తల్లి నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపి సుబ్బారావు మృతికి కారకురాలైన వీరకుమారిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
(The above story first appeared on LatestLY on Jul 31, 2022 05:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

