Tirupati Students Missing Case: తిరుపతి విద్యార్థుల మిస్సింగ్ కేసులో కీలక మలుపు.ఆగ్రాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు
తిరుపతిలో మిస్సయిన పదో తరగతి విద్యార్థుల (Tirupati Students Missing Case) ఆచూకీ ఎట్టకేలకు లభించింది.మిస్ అయిన ఐదుగురు విద్యార్థులను ఆగ్రా సమీపంలో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారు యూపీ పోలీసుల అదుపులో ఉన్నారు.
Tirupati, Nov 14: తిరుపతిలో మిస్సయిన పదో తరగతి విద్యార్థుల (Tirupati Students Missing Case) ఆచూకీ ఎట్టకేలకు లభించింది.మిస్ అయిన ఐదుగురు విద్యార్థులను ఆగ్రా సమీపంలో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారు యూపీ పోలీసుల అదుపులో ఉన్నారు. తిరుపతిలోని అన్నమయ్య స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు (Tirupati Scholl Students) ఈ నెల 9వ తేదీన అదృశ్యమయ్యారు. పిల్లల అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు తిరుపతి పడమర పోలీసులు. పిల్లలను తీసుకొచ్చేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఆగ్రాకు చేరుకున్నాయి.
ఈ నెల 9వ తేదీ ఉదయం స్టడీ అవర్ అని చెప్పి స్కూల్ కి వెళ్లిన పిల్లలు తరువాత కనిపించకుండా పోయారు. విద్యార్థులు రైలు ఎక్కినట్లు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపించింది. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. తాజ్ మహల్ చూడడానికి విద్యార్థులు ఆగ్రాకు వెళ్లారా? లేదా వేరే కారణం ఏదైనా ఉందా? అనేది తెలియాల్సి ఉంది.
(The above story first appeared on LatestLY on Nov 14, 2022 10:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

